జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2021-03-23T05:25:32+05:30 IST

జల సంరక్షణ ప్రతి ఒకరి బాధ్యతని, ఆ దిశగా ఆలోచన చేసి భవిష్యత్‌ తరాలకు సంవృద్ధిగా జలాన్ని అందించే చర్యలలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
జల భవన్‌ వద్ద అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేస్తున్న హిమాన్షు శుక్లా

 జాయింట్‌ కలెక్టర్‌   హిమాన్షు శుక్లా 

ఏలూరు సిటీ, మార్చి 22: జల సంరక్షణ ప్రతి ఒకరి బాధ్యతని, ఆ దిశగా ఆలోచన చేసి భవిష్యత్‌ తరాలకు సంవృద్ధిగా జలాన్ని అందించే చర్యలలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని జలభవన్‌లో సోమవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ పాల్గొని ఇం కుడు గుంతకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భూగర్భ జల మట్టాల  పెరుగుదలకు తమ వంతు కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, డ్వామా కార్యాలయ సిబ్బంది తో నీటి ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీని జేసీ ప్రారంభించారు. డ్వామా పీడీ రాంబాబు, ఏపీడీ పులి కుమారస్వామి రాజా, డీడీ హార్టీ కల్చర్‌ సుబ్బారావు, ఏపీఎంఐపీ పీడీ కె.షాజానాయక్‌, డీడీ గ్రౌండ్‌ వాటర్‌ డి.విజయబాబు ఎన్‌వైకే యూత్‌ అధికారి డి.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఏలూరు రూరల్‌ : ప్రకృతి వరంగా భావించే నీటిని పరి రక్షించడం మనం భావితరాలకు ఇచ్చే అమూల్యమైన కానుక అని ఇన్‌ఛార్జి ఎంపీడీవో ఎన్‌.సరళకుమారి అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సంద ర్భంగా జల శక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో పోణంగిలో నిర్వహించిన అవ గాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో కిషోర్‌ కుమార్‌, పంచా యతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు. 

ఏలూరు ఎడ్యుకేషన్‌ : సీఆర్‌ రెడ్డి కళాశాల ఫిజిక్స్‌, కెమిస్ట్రి, జియాలజి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల పరిరక్షణ దినోత్సవం కార్య క్రమంలో గ్రామోదయ ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ చేకూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడడం అలవర్చుకోవాలని సూచించారు. నీటి ప్రతిజ్ఞను విద్యార్థులతో డాక్టర్‌ ఎస్‌.మాన్‌సింగ్‌ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వీరభద్రరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇమ్మానియేల్‌, హెచ్‌వోడీలు సతీష్‌, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ రవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-23T05:25:32+05:30 IST