సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-12-31T05:56:27+05:30 IST

ఛీప్‌ లిక్కర్‌ రూ.50లకే ఇస్తామంటూ మద్యాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి డిమాండ్‌ చేశారు.

సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న హైమావతి

 ఛీప్‌ లిక్కర్‌ రూ.50లకే ఇస్తామనడం సిగ్గు చేటు

 ఐద్వా జిల్లా కన్వీనర్‌ హైమావతి డిమాండ్‌ 


ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 30 : ఛీప్‌ లిక్కర్‌ రూ.50లకే ఇస్తామంటూ మద్యాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి డిమాండ్‌ చేశారు. ఐద్వా కార్యాలయంలో గురువారం డి.వరలక్ష్మి అధ్యక్షతన కార్యకర్తల స మావేశం జరిగింది. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత మద్యానికి బానిసలుగా మార్చాలని వీర్రాజు చూస్తున్నారన్నారు. మద్యా న్ని దశల వారీగా నియంత్రించాలని, అనంతరం అసలు మద్యాన్నే రాష్ట్రంలో నిషేధించాలన్నారు. ఇప్పటికే మద్యానికి బానిసై చిన్న వయస్సులోనే భర్తలను కోల్పోయి చాలామంది మహిళలు ఆవేదనలో ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో లిక్కర్‌ను ప్రోత్స హిస్తూ వీర్రాజు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రూ.50లకే ఛీప్‌ లిక్కర్‌ ఇస్తామని చెప్పడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం వస్తే తాగించి తాగించి ప్రజలను చంపేస్తామని అన్నట్టు ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాగమణి, రాజ్యలక్ష్మీ, కుమారి, తులసీ, లక్ష్మీ, గీత పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:56:27+05:30 IST