లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్..?
ABN , First Publish Date - 2021-10-26T05:23:10+05:30 IST
ఒక మహిళను మోసగించి, అత్యాచారానికి పాల్పడిన ధర్మాజీగూడెం హెడ్ కానిస్టేబుల్ ధరావత్తు రంగారావునాయక్ సోమవారం రాత్రి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.

ఏలూరు క్రైం, అక్టోబరు 25 : ఒక మహిళను మోసగించి, అత్యాచారానికి పాల్పడిన ధర్మాజీగూడెం హెడ్ కానిస్టేబుల్ ధరావత్తు రంగారావునాయక్ సోమవారం రాత్రి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఏలూరులోని రిజర్వుడ్ విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మరణించ డంతో ఆయన భార్యతో పరిచయం పెంచుకున్న రంగారావు ఆమె కుమార్తె వివాహ సమయంలో తీసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఆపై ఆమెను ఏలూరులోని కొమడవోలులో ఉన్న హమాలీ కాలనీకి తీసుకువెళ్ళి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు ఆమెను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. కొంత నగదును ఆమె అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అతనికి సహకరించిన అతని భార్య నాగమణి, మరో మహిళ ధనలక్ష్మిలపై కేసు నమోదైంది. అతని వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 7న ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో రంగారావు, అతని భార్య నాగమణి, మరో మహిళపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతను సోమ వారం రాత్రి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.