ఖైనీ, గుట్కా కేంద్రంగా ఏలూరు.. పలువురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-07-12T06:23:09+05:30 IST

నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఖైనీ, గుట్కాల అక్ర మ వ్యాపారంపై పోలీసులు రెండు రోజులుగా దాడులు చేస్తూ భారీగా సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ఖైనీ, గుట్కా కేంద్రంగా ఏలూరు.. పలువురి అరెస్ట్‌

ఏలూరు క్రైం, జూలై 11 : నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఖైనీ, గుట్కాల అక్ర మ వ్యాపారంపై పోలీసులు రెండు రోజులుగా దాడులు చేస్తూ భారీగా సరుకును  స్వాధీనం చేసుకున్నారు. తంగెళ్ళమూడి ఎమ్మార్సీ కాలనీకి చెందిన తిరువీధుల శివను అరెస్ట్‌ చేసి రెండున్నర లక్షల ఖైనీ, గుట్కా ప్యాకెట్లను, 30 మద్యం బాటి ల్స్‌ను టూ టౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు స్వాధీనం చేసుకున్నారు. అతనికి సరఫరా చేస్తున్న జూలూరి శేషగిరిరావును అరెస్ట్‌ చేయగా, గణేష్‌ పరారీలో ఉన్నాడు. వన్‌టౌన్‌లోని రాయల్‌ లాడ్జి వద్ద కిళ్లీ షాపుపై దాడి చేసి 72 వేల ఖైనీ ప్యాకెట్లను, నాలుగు మద్యం బాటిల్స్‌,  రూ.400 నగదును స్వాధీనం చేసుకుని పల్లి సుధాకర్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు. కొత్తగూడెం సెంటర్‌లోని సామర్ల వెంకటరాజు కూల్‌డ్రింక్‌ షాపుపై దాడి చేసి 15 మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. షేక్‌ బషీర్‌ను అరెస్టు చేసి అతని నుంచి 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-07-12T06:23:09+05:30 IST