గాలాయగూడెంలో ఉత్సవాలకు పందిరి రాట

ABN , First Publish Date - 2021-12-30T05:55:30+05:30 IST

సంతానలక్ష్మిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్ప వల్లిగా పేరు పొందిన గాలాయగూడెం పూజారి వారి ఆడ పడుచు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్స వాల సందర్భంగా బుధవారం పందిరి రాట వేశారు.

గాలాయగూడెంలో ఉత్సవాలకు పందిరి రాట
పందిరి రాట వద్ద పూజలు

దెందులూరు, డిసెంబ రు 29 : సంతానలక్ష్మిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్ప వల్లిగా పేరు పొందిన గాలాయగూడెం పూజారి వారి ఆడ పడుచు అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్స వాల సందర్భంగా బుధవారం పందిరి రాట వేశారు. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. సుమా రు 2 లక్షల మంది  భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నా రు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. కార్య క్రమంలో కమిటీ సభ్యులు తుంగా రాము, పెద్దిశెట్టి నాని, పూజారి శ్రీనివాస రావు, పెద్దిశెట్టి బసవయ్య, రాంబాబు, గంటా సుబ్బారావు, కోటేశ్వరావు, అంబటి లక్ష్మణరావు, పూజారి వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:55:30+05:30 IST