మద్యం మత్తులో పురుగుల మందు తాగేశాడు

ABN , First Publish Date - 2021-10-22T04:23:41+05:30 IST

మద్యం మత్తులో మంచినీళ్లనుకుని, పురుగుల మందుతాగి ఓ వ్యక్తి మృతి చెందాడు.

మద్యం మత్తులో పురుగుల మందు తాగేశాడు

పెదవేగి, అక్టోబరు 21 : మద్యం మత్తులో మంచినీళ్లనుకుని, పురుగుల మందుతాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొప్పాకకు చెందిన చిట్టూరి శ్రీనివాస్‌ (55) మద్యానికి బానిస. గురువారం పొలంలో కలుపు నివారణ మందు పిచికారీ చేసి ఉదయం పదిగంటల సమయంలో ఇంటికొచ్చి, మద్యం మత్తులో మంచినీళ్ళనుకుని ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతనిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే  అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు.  మృతుడి కుమార్తె కట్టా సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-10-22T04:23:41+05:30 IST