ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం

ABN , First Publish Date - 2021-11-10T05:21:45+05:30 IST

సమాజంలోని ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడానికి న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని ఈ మేరకు ప్రజలకు అవగాహన కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోందని న్యాయసేవాధి కార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు అన్నారు.

ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం
ర్యాలీలో పాల్గొన్న జిల్లా జడ్జి భీమారావు, విద్యార్థులు

జిల్లా  జడ్జి భీమారావు

ఏలూరు క్రైం, నవంబరు 9 : సమాజంలోని ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడానికి న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని ఈ మేరకు ప్రజలకు అవగాహన కోసం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తోందని న్యాయసేవాధి కార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు అన్నారు. న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయ న మాట్లాడుతూ  ప్రతిఏటా నవంబరు 9వ తేదీని న్యాయసేవా దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో ఈ ఏడాది 6,245 కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరిచారన్నారు. 1130 ప్రీ లిటికేషన్‌ కేసులు పరిష్కరించి 520 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించా మన్నారు. 85 మందికి ఉచిత న్యాయసహాయాన్ని అందించామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించిన కేసుల్లో రూ.12 లక్షల పరిహారా న్ని అందించారన్నారు. పాన్‌ ఇండియా అవేర్‌నెస్‌ కార్యక్రమాలు అక్టోబరు 2వ తేదీ నుంచి నవంబరు 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని వాటిలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 372 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామన్నా రు. జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) పి.పద్మావతి, అదనపు ఎస్పీ ఎవీ సుబ్బరాజు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.బాలకృష్ణయ్య మాట్లాడా రు. ఏలూరు బార్‌ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి టి. మల్లిఖార్జున రావు, పోక్సో కోర్టు జడ్జి మేరీ గ్రేస్‌ కుమార్‌, 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌. కమలాకరరెడ్డి, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.మంగ, ఏలూరు బార్‌ ఉపాధ్యక్షుడు తిగిరిపల్లి సుబ్బారావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులు, న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కోర్టు నుంచి ఫైర్‌స్టేషన్‌ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పడి నినాదా లు ఇచ్చారు. న్యాయసేవాధికార సంస్థ అందించే న్యాయసహాయాన్ని తెలిపే కర పత్రాలను ప్రజలకు అందించారు.

Updated Date - 2021-11-10T05:21:45+05:30 IST