దేవాలయాలపై దాడులు చేస్తే రౌడీ షీట్‌

ABN , First Publish Date - 2021-01-21T05:00:08+05:30 IST

దేవాల యాలపై దాడులు చేసే వారిపై రౌడీ షీటు ఓపెన్‌ చేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

దేవాలయాలపై దాడులు చేస్తే రౌడీ షీట్‌

డీఐజీ మోహనరావు

ఏలూరు క్రైం, జనవరి 20 : దేవాల యాలపై దాడులు చేసే వారిపై రౌడీ షీటు ఓపెన్‌ చేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. ఏలూరు లోని డీఐజీ కార్యాలయం నుంచి బుధ వారం రాత్రి ఏలూరు రేంజ్‌ పరిధిలో ఉన్న ఉభయగోదావరి,కృష్ణా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.  డీఐజీ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో 53 దేవాలయాలపై జరిగినటు వంటి సంఘటనలలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొంతమంది నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. వారిపై రౌడీ షీటు ఓపెన్‌ చేయాలని ఆయన ఆదేశించారు. ఇంకా దర్యాప్తులో ఉన్న కేసుల్లో అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్ట్‌ చేయాలని ఆదేశిం చారు. రేంజ్‌ పరిధిలో 5327 రక్షక దళాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారి బాధ్యత వీఆర్వోలు పర్య వేక్షణ జరిగేలా చూడాలని సూచించారు. సోషల్‌ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ శాంతి భద్రత లకు విఘాతం కలిగించడం, ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఎవరు పోస్టులు పెట్టినా వారిపై కఠినంగా వ్యవ హరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. సోషల్‌ మీడియాపై పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2021-01-21T05:00:08+05:30 IST