పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అరికట్టండి

ABN , First Publish Date - 2021-10-29T05:01:26+05:30 IST

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఎం, సీపీఐ, సీపీఐఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎల్‌ రెడ్‌స్టార్‌ పార్టీ లు ఆధ్వర్యంలో గురువారం నిరసన, ధర్నా నిర్వహించారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అరికట్టండి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వామపక్ష నాయకులు

కలెక్టర్‌ వద్ద వామపక్షాల ధర్నా

ఏలూరు కలెక్టరేట్‌,  అక్టోబరు 28 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఎం, సీపీఐ, సీపీఐఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎల్‌ రెడ్‌స్టార్‌ పార్టీ లు ఆధ్వర్యంలో గురువారం నిరసన, ధర్నా నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి (మెట్ట) చింతకాయల బాబూరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌, న్యూమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధులు యు.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై భారా లు వేస్తోందన్నారు. పెట్రోలు, గ్యాస్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నా యన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంద న్నారు. ధర్నాలో బి.సోమయ్య, శ్యామలారాణి, ఎ.విజయలక్ష్మి, పి.ఆదిశేషు, కనకా రావు, బద్దా వెంకట్రావు, బండి వెంకటేశ్వరరావు, కన్నబాబు, సుబ్బారావు, నూక రాజు, భాస్కరరావు, నాగేంద్ర,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:01:26+05:30 IST