కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2021-01-14T05:54:19+05:30 IST

కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ జిల్లాకు చేరింది. ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ 33,500 డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ బుధ వారం తెల్లవారుజామున డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకుంది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది
కోల్ట్‌ స్టోరేజీల వద్ద పహరా

33,500 డోస్‌ల కొవిషీల్డ్‌  

కోల్డ్‌ స్టోరేజీల వద్ద సాయుధ పోలీసు పహరా.. నేడు సెషన్‌ సైట్లకు పంపిణీ 

రెండో విడత వ్యాక్సిన్‌కు 60,884 మంది ఉద్యోగులు గుర్తింపు 

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 13: కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ జిల్లాకు చేరింది. ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత  నడుమ 33,500 డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ బుధ వారం తెల్లవారుజామున డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రిజ్‌లో వాటిని భద్రపరిచారు. స్టోరేజీ గదికి సాయుధ పోలీసు బందో బస్తు కల్పించారు. ఒక్కొక్కటి 10 మిల్లీలీటర్ల వ్యాక్సిన్‌తో కూడిన వైల్స్‌ను సరఫరా చేశారు. కొ–విన్‌ యాప్‌లో రిజిస్టర్‌ అయిన ఒక్కో ఆరోగ్య కార్యకర్తకు 0.5 మి.లీ. చొప్పున వ్యాక్సిన్‌ను వేస్తారు. ఈ నెల 16న వ్యాక్సిన్‌ పంపిణీని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించిన వెంటనే జిల్లాలో ఎంపిక చేసిన 23 సెషన్‌ సైట్లలో తొలిరోజున టీకా మందు పంపిణీ ప్రారంభమవుతుంది. 18 నుంచి తొలి విడతలో నిర్దేశిం చిన హెల్త్‌ వర్కర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ మొత్తం 150 సెషన్‌ సైట్లలో కొనసాగిస్తారు. మూడు రోజుల్లోగా తొలి విడత వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయను న్నారు. జిల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ నిల్వలను గురువా రం సంబంధిత సెషన్‌ సైట్లకు ప్రత్యేక వాహనాల్లో తరలించి భద్రపర్చనున్నారు. రెండో విడతలో వ్యాక్సిన్‌ పంపిణీకి జిల్లాలో నాలుగు ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం 60,884 మందిని ఇప్పటికే గుర్తించారు. రెవెన్యూ శాఖలో 23,057 మంది ఉద్యోగులకు, పంచాయతీరాజ్‌లో 25,990 మందికి, పురపాలక శాఖలో 8,525 మందికి, పోలీస్‌ శాఖలో 3,312 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. మూడో విడతలో 50 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. మూడో విడత వ్యాక్సినేషన్‌ను అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఒక్కో సెషన్‌ సైటును ఏర్పాటుచేసి టీకా మందు వేస్తారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో 938, పట్టణ ప్రాంతాల్లో 278 సెషన్‌ సైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మూడో విడత వ్యాక్సినే షన్‌ పరిధిలోకి వచ్చే 50 ఏళ్ల వయసు పైబడిన వారి వివరాలను స్థానిక సచివాలయాల నుంచి సేకరించి జాబితాలను వ్యాక్సిన్‌కు అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ జరుగు తోంది. 

వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం

‘రెండు, మూడో విడతల వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ పంపి ణీ జరిగే మూడో విడత వ్యాక్సినేషన్‌లో గర్భిణీలు, 18 ఏళ్లలోపు ఉన్నవారు, మొండి వ్యాధులు ఉన్న వారికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వరాదని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసు కుంది. ఆ ప్రకారం 19 ఏళ్లు వయస్సు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తారు’ అని డీఎంహెచ్‌వో సునంద తెలిపారు. 


Updated Date - 2021-01-14T05:54:19+05:30 IST