అపర భగీరథుడు కాటన్ దొర
ABN , First Publish Date - 2021-05-16T05:20:14+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్రపోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.
పలుచోట్ల కాటన్ దొర జయంతి వేడుక
పాలకొల్లు అర్బన్, మే 15 : ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్రపోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. కాటన్ దొర 219వ జయంతి సందర్భం గాఽశనివారం స్థానిక లాకుల వద్ద ఉన్న కాటన్‌దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ఆనాడు కాటన్ దొర ప్రజలకు అన్నం పెడితే, నేడు జగన్ సున్నం పెడుతున్నారని విమర్శించారు. రైతు భరోసాలో కౌలు రైతులకు మొండి చెయ్యి చూపారని రామానాయుడు విమర్శించారు. గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం సర్ ఆర్థర్ కాటన్ దొర అని నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్ అన్నారు. కాటన్ దొర జయంతి సందర్భంగా రైలు గేటు వద్ద ఉన్న కాంప్లెక్స్‌లోని కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాలకొల్లు: స్థానిక రైలు గేటు వద్ద గల అందే నాని తేజా ప్లాజా కాంప్లెక్స్‌లో ఉన్న సర్ ఆర్థర్ కాటన్‌దొర జయంతి కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్ ఇంజనీర్ అందే జయపాల్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్ ముఖ్య అతిఽథిగా పాల్గొని కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ, పాలకొల్లు ఏఎంసీ మాజీ చైర్మన్ ఉన్నమట్ల కపర్ధి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు చందక సత్తిబాబు, గంగా పవన్, షేక్ జాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
పెనుమంట్ర: పెనుమంట్ర మండలం మార్టేరు జంక్షన్‌లో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలను శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ కర్రి వేణుబాబు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆచంట: అపర భగీరఽథుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిరా సీతారాం అన్నారు. కాటన్ దొర జయంతి సందర్భంగా ఆచంట ఏఎంసీ కార్యాలయం వద్ద కాటన్ దొర విగ్రహనికి ఇందిరా సీతారాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కాటన్‌దొర విగ్రహనికి తహసీల్దార్ మధుసూదనరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కొడమంచిలిలో కాటన్ విగ్రహనికి ఏఎంసీ చైర్మన్‌తో పాటు సర్పంచ్ సుంకర సీతారాం పాలాభిషేకం నిర్వహించారు.