కొవిడ్‌పై పోరులో భాగస్వాములు కండి

ABN , First Publish Date - 2021-05-21T04:27:33+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొ నడంలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు.

కొవిడ్‌పై పోరులో భాగస్వాములు కండి
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

 స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పిలుపు

ఏలూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొ నడంలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడు తూ జిల్లాలో కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి, వారు ఏ ప్రాంతాల్లో, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో తెలపా లన్నారు. దీనికి సంస్థల ప్రతినిధులు  సానుకూలంగా స్పందించారు. సమావేశం లో జేసీ హిమాన్షు శుక్లా, ఇన్‌చార్జి డీఆర్వో ఉదయభాస్కర్‌, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ జయప్రకాశ్‌, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  


కేసులున్న చోట చిన్నపనులకు ప్రాధాన్యం 

కొవిడ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద చిన్న చిన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సూచించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ఆయన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నియమా లను పాటిస్తూ ఉపాధి పనులు చేపట్టాలన్నారు. వీసీలో జేసీ వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్ర భాస్కర్‌ రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌, డీఎంహెచ్‌వో సునంద, డీఎస్‌వో సుబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T04:27:33+05:30 IST