వారికి సెలవులు ఎవరిచ్చారు?

ABN , First Publish Date - 2021-02-08T06:09:18+05:30 IST

తొలి విడత ఎన్నికలు జరుగుతున్న నరసాపురం డివిజన్‌లో కొం దరు ఉద్యోగులు సెలవులు పెట్టారు. వీరికసలు సెలవు ఎవరిచ్చారు ? ఇది సహించరాని తప్పిదం.

వారికి సెలవులు ఎవరిచ్చారు?
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ ముత్యాలరాజు ఆగ్రహం

ఆకివీడు/ఏలూరు/ఉండి, ఫిబ్రవరి 7:‘తొలి విడత ఎన్నికలు జరుగుతున్న నరసాపురం డివిజన్‌లో కొం దరు ఉద్యోగులు సెలవులు పెట్టారు. వీరికసలు సెలవు ఎవరిచ్చారు ? ఇది సహించరాని తప్పిదం. ఇలాంటి వారిని సస్పెండ్‌ చేస్తా’ అని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కల విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం ఆకివీడు,ఉండి మండల పరిషత్‌ కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వంచారు. డివిజన్‌ పరిధిలో 239 గ్రామ పంచాయతీలకుగాను 2,552 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 41 సర్పంచ్‌లు, 1044 వార్డులు ఏకగ్రీవం కావడంతో 198 గ్రామ సర్పంచులకు 1,508 వార్డులకు గాను 2,324 పోలింగ్‌ బూత్‌లలో మంగళవారం ఎన్నికల జరుగుతాయన్నారు. 85 సమస్యాత్మక గ్రామాలు, 13 అత్యంతసమస్యాత్మక గ్రామాలున్నాయన్నారు. మైక్రో అబ్జర్వర్లు – 107, వెబ్‌ క్యాస్టింగ్‌లు–72, పీవోలు – 2,321 మందిని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు అసౌకర్యం కలుగకుండా రవాణా నిమిత్తం 152 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. డివిజన్‌ను 24 జోన్‌లుగా విభజించి 36 మంది జోనల్‌ అధికారు లను, 36 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములను, 36 ఎస్‌ఎస్‌టీ టీములను, 12 షాడో టీములను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 107 మంది సూక్ష్మ పరిశీలకులు, 2,321 మంది పీవోలు, 3,901 మంది ఓపీవోలు, 825 మంది రిజర్వు పీవోలు, 1,189 మంది రిజర్వు ఓపీవోలను నియమించామని తెలిపా రు. సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, ఎంపీడీవో పోశింశెట్టి రమాదేవి, మండల ప్రత్యేకాధికారి ఈదా అనిల్‌కుమారి, తహసీల్దార్‌ సూర్యకుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2021-02-08T06:09:18+05:30 IST