బాలింతలకు రక్తాన్ని అందుబాటులో ఉంచండి

ABN , First Publish Date - 2021-08-22T05:20:32+05:30 IST

‘ఆస్పత్రిలో బాలింతలకు అవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.. ముఖ్యంగా ‘ఓ’ పాజిటివ్‌ రక్తం నిల్వలు అందు బాటులో ఉండే విధంగా చూడండి’ అంటూ డీసీహెచ్‌ఎస్‌ను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.

బాలింతలకు రక్తాన్ని అందుబాటులో ఉంచండి
డయాలసిస్‌ వార్డును పరిశీలిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

 కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా  

జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు 

ఏలూరు క్రైం, ఆగస్టు 21: ‘ఆస్పత్రిలో బాలింతలకు అవసరమైన రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.. ముఖ్యంగా ‘ఓ’ పాజిటివ్‌ రక్తం నిల్వలు అందు బాటులో ఉండే విధంగా చూడండి’ అంటూ డీసీహెచ్‌ఎస్‌ను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఏలూరులోని ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్‌ యూనిట్‌, ప్రత్యేక నవజాతి శిశు చికిత్స కేంద్రం, బాలింతలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి చికిత్స పొందు తున్న వారితో మాట్లాడారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీ హెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌, ఆస్పత్రి ఆర్‌ఎంవో పీఏఆర్‌ఎస్‌ శ్రీనివాసరావు,  డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఐసీయూ పడకలు ప్రారంభం

ఏలూరు కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో 10 ఐసీయూ బెడ్‌లను ఏలూరు  ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో కలిసి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శనివారం ప్రారంభించారు. యూఎస్‌ఏకి చెందిన నిర్మాన్‌ ఆర్గనైజేషన్‌ వారు ఈ బెడ్‌లు విరాళంగా అంద జేశారు.


ప్రతిరోజు  బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సమర్పించాలి : కలెక్టర్‌

ఏలూరుసిటీ, ఆగస్టు 21: బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు విఽధిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి డివిజన్‌, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అన్ని రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గ్రామ/వార్డు సచివాల య సిబ్బంది అటెండెన్స్‌ ప్రతిరోజు విధిగా కలెక్టరేట్‌కు నిర్ణీత సమ యంలో సమర్పించాలని, ప్రతి రోజు అటెండెన్స్‌ 95 శాతం తక్కువ కాకుండా ఉండాలని ఆదేశించారు. వలంటీర్లు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో బయోమెట్రిక్‌ అటెం డెన్స్‌ వేస్తారని వారి అటెండెన్స్‌ కూడా కలెక్టర్‌ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. స్పందన దరఖాస్తులను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలన్నా రు. జగనన్నతోడు, కాపునేస్తం, చేయూత పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదా రుల నుంచి డిజిటల్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ సమర్పించని ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో జేసీలు హిమాన్షు శుక్లా (అభివృద్ధి), బీఆర్‌ అం బేడ్కర్‌ (రెవెన్యూ), పి.పద్మావతి (సంక్షేమం), డీఆర్వో డేవిడ్‌రాజు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-08-22T05:20:32+05:30 IST