వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
ABN , First Publish Date - 2021-05-25T04:52:28+05:30 IST
ఏలూరు ఎన్‌ఆర్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం పరిశీలించారు.

ఏలూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ఏలూరు ఎన్‌ఆర్ పేట వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా సోమవారం పరిశీలించారు. కేంద్రంలో వివరాల నమోదు, వ్యాక్సిన్ వేసే విధానం, క్యూలైన్లను ఆయన పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చినవారిని పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వ్యాక్సిన్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలిపారు. జ్వరం వచ్చిన భయపడవద్దని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.