ఎన్నికల్లో పొరపాట్లకు తావివ్వద్దు

ABN , First Publish Date - 2021-02-09T05:10:51+05:30 IST

పొరపాట్లకు తావు లేకుండా సకాలంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.

ఎన్నికల్లో పొరపాట్లకు తావివ్వద్దు
రెండవ దశ ఎన్నికలపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టర్‌ ముత్యాలరాజు

ఏలూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): పొరపాట్లకు తావు లేకుండా సకాలంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఆయన రెండో దశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవ్వూరు ఆర్డీవో, డీఎల్‌పీవో, ఎంపీడీవోలు, తహసీల్దారులు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికల్లో ఎవరూ పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదని, ఒకటికి రెండుసార్లు అన్నీ పరిశీలించి నిర్ధారించుకోవాలని చెప్పారు. స్వస్తిక్‌ గుర్తు క్లాక్‌ వైజ్‌ ఉన్న వాటినే ఓటింగ్‌కు ఉపయోగించాలని సూచించారు. భిన్నంగా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. బ్యాలెట్‌ పేపరులో కేటాయించిన గుర్తులు, అభ్యర్థుల పేర్లను సరిచూసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఈ నెల 11 నాటికి జారీ చేయాలన్నారు. విధులకు ఎన్నికల కమిషన్‌ సూచించిన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వీసీలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, డీపీవో కె.రమేశ్‌బాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-09T05:10:51+05:30 IST