దూకుడు తగ్గిన కరోనా

ABN , First Publish Date - 2021-05-25T05:03:53+05:30 IST

మండలంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడు తోంది.

దూకుడు తగ్గిన కరోనా
మల్కాపురంలో సూపర్‌ శానిటేషన్‌ పనులు

గ్రామాల్లో తక్కువగా నమోదవుతున్న కేసులు

ఏలూరు రూరల్‌, మే 24: మండలంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడు తోంది. సోమవారం 14 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మండల  వైద్యాధికారి దేవ్‌మనోహర్‌ కిరణ్‌ తెలిపారు. బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి ఉదయం కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. సోడియం హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ చల్లి సూపర్‌ శానిటేషన్‌ పనులు చేపట్టారు. ఆశా వర్క ర్లు, ప్రతి ఇంటికి వెళ్లి జ్వర లక్షణాలతో ఉన్న వాళ్లను ఆరా తీసి ఫీవర్‌ సర్వే నిర్వహించారు.  


కిటకిటలాడుతున్న దుకాణాలు

వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం మినీ లాక్‌డౌన్‌ విధించింది. మధ్యాహ్నం 12 గంటలకే దు కాణాలు మూసివేస్తే జనాలు ఇళ్లకే పరిమితం అవుతారని భావించింది. అయితే ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వా త షాపులు ఉండవని ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చే స్తున్నారు. దీంతో వ్యాపారం నిర్వహించే వీధులన్నీ జనం తో నిండిపోతున్నాయి. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అధికారులకు మా త్రం ఇవేమీ పట్టకకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


దెందులూరు మండలంలో–15  

దెందులూరు, మే 24 : మండలంలో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతుండటంతో మండలవాసుల్లో ఆందోళన పెరుగుతోంది. మండలంలో ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తహసీల్దార్‌ వి.నాంచారయ్య తెలిపారు. కొవ్వలిలో 2, పోతునూరు–2, చల్లచింతలపూడి–1, సీతంపేట–2, దోసపాడు–1, రామారావుగూడెం–1, గోపన్నపాలెం–3, గాలాయ గూడెం–1, దెందులూరు–2 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


పెదపాడు మండలం –14  

పెదపాడు, మే 24 : మండలంలో సోమవారం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెదపాడు పీహెచ్‌సీ పరిధిలోని వసంతవాడ 5, పెదపాడు, తోట గూడెం, నాయుడుగూడెం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పు న, వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో అప్పనవీడు, కొక్కిర పాడులో ఒక్కొక్కటి, కలపర్రులో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులకు సంబంధిం చి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  


పెదవేగి మండలం–20  

పెదవేగి, మే 24: పెదవేగి మండలంలో సోమవారం 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు ఉన్నా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆయన తెలిపారు.  

Updated Date - 2021-05-25T05:03:53+05:30 IST