పొలాల్లోకి దూసుకెళ్ళిన కారు

ABN , First Publish Date - 2021-07-09T04:29:41+05:30 IST

వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి పంటబోదెను దాటి పంటపొలాల్లోకి దూసుకుపోయిన సంఘటన గురువారం తెల్లవారుజామున నిడదవోలు మండలం డి.ముప్పవరం సమీపంలో చోటు చేసుకున్నది.

పొలాల్లోకి దూసుకెళ్ళిన కారు

నిడదవోలు, జూలై 8: వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి పంటబోదెను దాటి పంటపొలాల్లోకి దూసుకుపోయిన సంఘటన గురువారం తెల్లవారుజామున నిడదవోలు మండలం డి.ముప్పవరం సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  డి.ముప్పవరం మీదుగా వెళుతున్న స్విఫ్ట్‌ కారు పంటబోదెను దాటి పంటపొలాల్లోకి బోల్తా కొట్టిందని, అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదము చోటు చేసుకోలేదని వారు వేరే వాహనంలో వెళ్లిపోయారని తెలిపారు అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.


Updated Date - 2021-07-09T04:29:41+05:30 IST