ఏలూరు కాల్వకు నీటి విడుదల నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-18T05:37:46+05:30 IST

విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి ఏలూరు కాలువకు సోమవారం నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్టు పశ్చిమ డెల్టా నీటి పారుదలశాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ దక్షిణామూర్తి తెలిపారు.

ఏలూరు కాల్వకు నీటి విడుదల నిలిపివేత

నిడదవోలు, మే 17: విజ్జేశ్వరం హెడ్‌ స్లూయీజ్‌ నుంచి ఏలూరు కాలువకు సోమవారం నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్టు పశ్చిమ డెల్టా నీటి పారుదలశాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ దక్షిణామూర్తి తెలిపారు. పశ్చిమ డెల్టా కాలువలకు ఏప్రిల్‌ 20న నీటిని నిలిపివేయగా ఏలూరులో తాగునీటి సమస్య దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 24 రోజులపాటు ఏలూరు కాలువకు నీటిని విడుదల చేస్తూ వచ్చామని చెప్పారు.  

Updated Date - 2021-05-18T05:37:46+05:30 IST