యువకుడిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-03-23T05:08:43+05:30 IST

ఒక మహిళ విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.

యువకుడిపై కత్తితో దాడి
గాయపడ్డ పవన్‌ కుమార్‌

జంగారెడ్డిగూడెంటౌన్‌, మార్చి 23: ఒక మహిళ విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని దళితపేటకు చెందిన ముప్పిడి పవన్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌, కీర్తి కుమార్‌ల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఈ గొడవలో పవన్‌ కుమార్‌పై దిలీప్‌, కీర్తిలు కత్తితో దాడిచేశారు. పవన్‌ కుమార్‌ను 108 వాహనంలో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పట్ణణ ఎస్సై కుటుంబరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Updated Date - 2021-03-23T05:08:43+05:30 IST