సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు : ఏఎస్పీ సుబ్బరాజు
ABN , First Publish Date - 2021-10-30T04:45:21+05:30 IST
పోలీస్ సిబ్బంది సమస్యలను త్వరితగతిన పరి ష్కరించడానికి ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారని జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు.
ఏలూరు క్రైం, అక్టోబరు 29 : పోలీస్ సిబ్బంది సమస్యలను త్వరితగతిన పరి ష్కరించడానికి ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారని జిల్లా అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్ర వారం జిల్లాలోని 61 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది వార్షిక ఇంక్రిమెంట్లు, మెడికల్ బిల్లులు, సర్వీసు రూరల్స్, హౌస్‌రెంట్ వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసు కొచ్చారు. వీటన్నింటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మినిస్టీరియల్ సిబ్బంది నుంచి కూడా వినతుల ను స్వీకరించారు. జిల్లా పోలీస్ సంక్షేమ నోడల్ అధికారి ఆర్‌ఐ ఎం.రాజా, ఏఆర్ ఆర్‌ఐలు మనోహర్, కృష్ణంరాజు, పోలీసు కార్యాలయ ఏఈవో రామ్‌కుమార్, సూపరింటెండెంట్ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.