వయసు 33 .. చోరీలు 35

ABN , First Publish Date - 2021-03-22T05:36:43+05:30 IST

బాల్యంలో అల్లరి చిల్లరిగా తిరు గుతూ చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఒంటరిగా నేరాలు చేసేవాడు. పోలీసులకు చిక్కడం.. ఆపై జైలు నుంచి విడుదల వడం.. మళ్లీ యఽథావిధిగా నేరాలకు పాల్పడడం నిత్యకృత్యమైంది. అతని పేరు.. గోడి సతీష్‌ కుమార్‌..

వయసు 33 .. చోరీలు 35
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ నారాయణ నాయక్‌

యర్నగూడెం చోరీ నిందితుడి అరెస్ట్‌ 

రూ.18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

12 కేసుల్లో జైలు శిక్ష  : ఎస్పీ నాయక్‌ 

ఏలూరు క్రైం, మార్చి 21: బాల్యంలో అల్లరి చిల్లరిగా తిరు గుతూ చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఒంటరిగా నేరాలు చేసేవాడు. పోలీసులకు చిక్కడం.. ఆపై జైలు నుంచి విడుదల వడం.. మళ్లీ యఽథావిధిగా నేరాలకు పాల్పడడం నిత్యకృత్యమైంది. అతని పేరు.. గోడి సతీష్‌ కుమార్‌.. అలియాస్‌ కాకి. వయసు 33 ఏళ్లు. ఇప్పటి వరకు చేసిన నేరాలు 35. పన్నెండు నేరాల్లో జైలు శిక్ష అనుభవించాడు. మిగిలిన కేసులు కోర్టు విచారణలో ఉన్నా యి. యర్నగూడెంలో ఈ నెల 15వ తేదీ రాత్రి ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. 18 లక్షల 15 వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ కె.నారాయణనాయక్‌ ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరులకు వెల్లడించారు. యర్నగూడెంలో 27 కాసు ల బంగారు ఆభరణాలు, నగదు అపహరణపై దేవరపల్లి పోలీ సులు కేసు నమోదుచేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్‌ ఆధారంగా నేరస్తుడిని గుర్తించారు. ఈ నెల 21వ తేదీ పంగిడిలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న రాజ మహేంద్రవరం ఆనంద్‌నగర్‌కు చెందిన సతీష్‌కుమార్‌ను అదు పులో తీసుకుని విచారించారు. అతనిపై రాజమండ్రి  త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీటు ఉంది. యర్నగూడెం దొంగ తనం కేసులో చోరీ సొత్తు మొత్తం రికవరీ చేశామని, దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌లో రెండు, సమిశ్రగూడెం స్టేషన్‌ పరిధిలో ఒక దొంగతనా నికి అతను పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. అతని నుంచి మొత్తం 12 లక్షల నగదు, ఆరు లక్షల విలువైన 30 కాసుల బంగారం, 15 వేల విలువైన 330 గ్రాముల వెండి, మొత్తం 18 లక్షల 15 వేల రూపాయల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీతోపాటు కొవ్వూరు డీఎస్పీ శ్రీ నాధ్‌, సీసీఎస్‌ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు, కొవ్వూరు రూరల్‌ సీఐ ఎం.సురేష్‌, కొవ్వూరు సీసీఎస్‌ సీఐ ఎం.కృపానందం, సీసీ ఎస్‌ ఎస్‌ఐ కేశవరావు, కొవ్వూరు టౌన్‌ ఎస్‌ఐ రవీంద్రబాబు, దేవ రపల్లి ఎస్‌ఐ కె.స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులకు అవార్డులు ప్రకటించి ప్రదానం చేశారు.


Updated Date - 2021-03-22T05:36:43+05:30 IST