రోడ్డు ప్రమాదంలో ‘విద్వాన్‌’ శ్రీనివాసాచార్యుల దంపతులు మృతి

ABN , First Publish Date - 2021-12-09T05:43:38+05:30 IST

ద్వారకాతిరుమల వేద పాఠశాలలో అధ్యా పకుడిగా సేవలందించిన అగ్నిహోత్రం శ్రీనివా సాచా ర్యులు (58), ఆయన భార్య రాజ్యలక్ష్మి (55) ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో ‘విద్వాన్‌’ శ్రీనివాసాచార్యుల దంపతులు మృతి
శ్రీనివా సాచా ర్యులు దంపతులు (ఫైల్‌)

ద్వారకాతిరుమల వేద పాఠశాలలో అధ్యాపకుడిగా సేవలు

ప్రకాశం జిల్లాలో ప్రమాదం.. 

స్థానికంగా విషాదఛాయలు

ద్వారకా తిరుమల, డిసెంబరు 8 : ద్వారకాతిరుమల వేద పాఠశాలలో అధ్యా పకుడిగా సేవలందించిన అగ్నిహోత్రం శ్రీనివా సాచా ర్యులు (58), ఆయన భార్య రాజ్యలక్ష్మి (55) ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ప్రసుత్తం ఆయన తిరుపతిలో నడుస్తున్న వేద విశ్వవిద్యాలయ వైఖానస ఆగమ విద్వాన్‌గా డీన్‌ హోదాలో  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో అయ్యప్ప పూజకు వెళ్తుండగా బుధవారం వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. శ్రీనివాసాచార్యుల కుటుంబానికి ద్వారకా తిరుమలతో ఎంతో అనుబంధం ఉంది. దంపతులు మృతిచెందారన్న వార్త తెలియడంతో స్థానికంగా విషాదం అలుముకొంది. ఆయన సహచరులు, విద్య నేర్చుకున్న శిష్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఇక్కడ పనిచేసినపుడు సొంతిల్లు కూడా నిర్మించుకున్నారు. 1985 నుంచి వేద పాఠశాలలో బోధకుడిగా పనిచేశారు. 2014 వరకు ఇక్కడ అధ్యాపకుడిగా, ప్రధాన అధ్యాపకుడిగా పనిచేసి వందలాది మంది వేదపండితులను తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆయన తిరుపతి వేద పాఠశాలకు వెళ్లిపో యారు. అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు, జ్యోతిష్య శాస్త్రంలో నిష్ట్ణాతులైన ఈయన ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 150 దేవాలయాల్లో ప్రధానాచార్యుడిగా ప్రతిష్ఠా కార్యక్రమా లను నిర్వహించారు. శ్రీనివాసాచార్యులకు ఇద్దరు కుమా రులు. వారు తిరుమలలో పౌరోహిత్యం చేస్తున్నారు. ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ దంపతు లిద్దరూ మృతిచెందడం అందరినీ కలచివేసింది. 

Updated Date - 2021-12-09T05:43:38+05:30 IST