రోడ్డు ప్రమాదంలో తాపీ మేస్ర్తి మృతి

ABN , First Publish Date - 2021-02-02T05:04:20+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై జీజే విష్ణువర్థన్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో తాపీ మేస్ర్తి మృతి
పంట కాల్వ పక్కన మృతి చెందిన తాపీమేస్ర్తి

చాగల్లు, ఫిబ్రవరి 1: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై జీజే విష్ణువర్థన్‌ తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న సుజారావు (19) తాపీ మేస్ర్తిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పనికి వెళ్లిన అతడు సోమవారం ఉదయం పెట్రోలు బంక్‌ వద్ద పంట కాలువ పక్కన మృతి చెందినట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి అదుపుతప్పి రోడ్డు పక్కన గల విద్యుత్‌ స్తంభాన్ని మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టడంతో పక్కన ఉన్న పంట పొలాల్లో పడి రక్త స్రావంతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు మహిమ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 


Updated Date - 2021-02-02T05:04:20+05:30 IST