భళా..భళారే..

ABN , First Publish Date - 2021-07-09T05:26:28+05:30 IST

వేలాది బుర్ర కథ ప్రదర్శనలు ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న కళాకారుడు మిరి యాల అప్పారావు.

భళా..భళారే..

అబ్బురపరిచే అప్పారావు బుర్ర కథ విన్యాసం

దేశ విదేశాల్లో ఐదు వేలకుపైగా ప్రదర్శనలు.. మైమరిచిపోయే అభిమానులు 

ఎన్నో అవార్డులు, బిరుదులతో సత్కారాలు

వైఎస్‌ఆర్‌ సాఫల్య అవార్డుకు ఎంపిక

ఏలూరు సిటీ, జూలై 8 :ఆయన కాలికి గజ్జె కట్టి.. భుజాన తంబురా పట్టి.. భళా.. భళానోయ్‌ తమ్ముడా.. అంటూ పాట అందుకుని.. పదం కదిపితే.. ప్రేక్షకులు మైమరిచి పోవా ల్సిందే. తానా.. తందానా అంటూ శృతి కలపాల్సిందే. తెలుగు రాష్ట్రం నాలుగు చెరగులా వేలాది బుర్ర కథ ప్రదర్శనలు ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న కళాకారుడు మిరి యాల అప్పారావు. ఎన్నో అవార్డులు, మరెందరి నుంచి ప్రశం సలు అందుకున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల జాబితాలో వైఎస్‌ఆర్‌ సాపల్య అవార్డుకు ఎంపికచేసింది. దీనిని ఆగస్టు రెండో వారంలో ప్రదానం చేయనుంది.అప్పారావు ఎందరో కళాకారులకు బుర్రకథలో శిక్షణ ఇవ్వటమే కాకుండా వారిని మేటి కళాకారులుగా తీర్చిదిద్దారు. తూర్పు గోదావరి జిల్లా నడకుదురులో 1949  సెప్టెంబరు 9న వెంకట్రామయ్య, తిరుపతమ్మ దంపతులకు రెండో కుమా రుడుగా జన్మించారు. కాలక్రమంలో తాడపల్లిగూడెంలో స్థిరప డ్డారు. చిన్నప్పటి నుంచే రాగాలు ఆలపిస్తూ రాగాల అప్పా రావుగా ప్రసిద్ధి గాంచారు. 1969లో డ్రాయింగ్‌ మాస్టారు, జూనియర్‌ నాజర్‌, రావిశెట్టి వీరేశం వంటి గురువుల వద్ద శిక్షణ పొందారు.1970లో నడకుదురులో సువర్ణకంకణ ధారణ  జరిగింది. 1974లో రేడియోలో కార్యక్రమాలు చేసి, 1993 లో దూరదర్శన్‌లో ప్రోగ్రాంలు ఇచ్చారు. 1975లో పెద్దాపురం లో బుర్ర కథా పోటీలలో ప్రథమ బహుమతి సాధించి 50 తులాల వెండి కప్పును పొందారు. గాన కోకిల, బుర్రకథ టైగర్‌ అనే బిరుదులు సొంతం చేసుకున్నారు. పౌరాణిక నాట కాల్లోనూ ప్రవేశం పొంది ప్రత్యేకత చాటుకున్నారు. చింతా మణిలో బిల్వ మంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు వంటి పాత్రలను అద్వితీయంగా పోషించారు. బుర్రకథలో సారో ఘట్టాన్ని పండించగల ఏకైక కళాకారు డు ఆయన. సీతా కల్యాణం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామ రాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఝాన్సీ లక్ష్మీభాయ్‌ వంటి అనేక కథలను..తన కథనా కౌశలంతో పండించేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఐదు వేలకుపైగా ప్రద ర్శనలు ఇచ్చారు. సింగపూర్‌లో ఆయన బుర్రకథ కార్యక్రమం అందరినీ అలరింజేసింది. ఆయన కుమార్తె యడవల్లి శ్రీదేవి కూడా బుర్రకథ కళాకారిణి కావడం విశేషం. ఎందరో బుర్ర కథ కళాకారులను తీర్చిదిద్దిన అప్పారావుకు ఈ అవార్డు దక్క డంపై కళకు గుర్తింపు లభించిందని పలువురు పేర్కొన్నారు.  


బుర్రకథకు గుర్తింపు – మిరియాల అప్పారావు, బుర్రకథ కళాకారుడు

వైఎస్‌ఆర్‌ సాఫల్య అవార్డు రావటం బుర్ర కథకు తగిన గుర్తింపు లభించినట్లే. ఆంధ్రప్రదేశ్‌ జానపద కళలలో బుర్ర కథకు అత్యంత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయం. కళ లకు ఆదరణ నానాటికీ తగ్గుతున్న తరుణంలో జానపద కళ లకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పించాలి. బుర్రకథ కళా కారులను ఆదుకోవాలి. జానపద కళలలో ప్రసిద్ధి గాంచిన ఈ కళను యువ కళాకారులు ప్రాచుర్యం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలి.  


Updated Date - 2021-07-09T05:26:28+05:30 IST