నాలుగు మండలాల్లో 25 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-09T05:04:27+05:30 IST
ఏలూ రు రూరల్ మండలం, దెందులూరు మండలాల్లో గురువారం కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టగా పెద పాడు, పెదవేగి మండలాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరిగింది.

ఏలూరు రూరల్/ దెందులూరు/ పెదపాడు/ పెదవేగి, జూలై 8 : ఏలూ రు రూరల్ మండలం, దెందులూరు మండలాల్లో గురువారం కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టగా పెద పాడు, పెదవేగి మండలాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరిగింది. ఏలూరు రూర ల్ మండలంలో రెండు కేసులు నమోద యినట్టు మండల వైద్యాధికారి దేవ్ మనోహర్ కిరణ్ తెలిపారు. కేసులు తగ్గినా తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం, తరచు శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. దెందులూరు మండలంలో పోతునూరు, మేదినరావుపాలెం, గాలాయగూడెంలో ఒక్కొక్కటి చొప్పున మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తహసీల్దార్ వి.నాంచారయ్య, ఎంపీ డీవో లక్ష్మి తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో కొక్కిర పాడులో రెండు, వట్లూరులో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలోని పెదపాడులో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. పెదవేగి మండలంలో గురువారం పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టీవీఎల్.ప్రసన్నకుమార్ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో హోం ఐసోలేషన్‌లో 1168 మంది ఉండి, చికిత్స పూర్తి చేసుకున్నారని తెలిపారు. 129 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, 93 మంది ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ మరణాలు 25 కాగా అందులో ఐదుగురు ఇంటిదగ్గర మృతి చెందగా, 20 మంది ఆస్పత్రిలో మృతి చెందారన్నారు.