రుణాలు సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-10-22T04:28:47+05:30 IST
చిరువ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులు పెట్టుబడి నిమిత్తం పొందిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించాల ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమాఖ్య సభ్యులను కోరారు.
ఏలూరు సిటీ, అక్టోబరు 21: చిరువ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులు పెట్టుబడి నిమిత్తం పొందిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించాల ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమాఖ్య సభ్యులను కోరారు. వట్లూరు డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన 190వ జిల్లా సమాఖ్య సమావేశంలో గురువారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్తీ నిధి, జగనన్న తోడు కింద చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులు పెట్టుబడి నిమిత్తం పొందిన రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందా లన్నారు. నెలనెలా కిస్తీలు కట్టకపోతే సున్నా వడ్డీ రాయితీని పొందే అవకాశం ఉండదని సమాఖ్య సభ్యులు లబ్ధిదారులకు అవ గాహన కల్పించాలన్నారు. జిల్లా సమాఖ్య సమావేశంలో చర్చించిన అంశాలను మండల సమాఖ్య, గ్రామ సమా ఖ్య సభ్యులకు వివరించి రుణాలు సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా 90 వేల మంది లబ్ధిదారులకు రూ.92 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. జగనన్నతోడు వడ్డీ రాయితీ కోటి 25 లక్షల రూపాయలను 34,463 మంది లబ్ధిదారుల ఖాతాలలో బుధవారం జమ చేశారన్నారు. సమా వేశంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షుడు టి.రమాదేవి, కోశాధికారి ఎండీ జారా, సహాయ కార్యదర్శి డి.మాధవి, వివిధ మండల సమా ఖ్య అధ్యక్షుడు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి ఏపీడీ అనిత, ఏరియా కోఆర్డినేటర్లు తదితరు లు పాల్గొన్నారు.