కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు సమగ్ర సహాయం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-10T05:24:17+05:30 IST

కొవిడ్‌ 19 మహామ్మరి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సహాయాన్ని అందించాలని వారికి తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు సమగ్ర సహాయం : కలెక్టర్‌
పీఎంకేర్‌ చిల్డ్రన్స్‌ పథకంపై సమీక్షిస్తున్న కలెక్టర్‌

ఏలూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ 19 మహామ్మరి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సహాయాన్ని అందించాలని వారికి తోడుగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం పీఎంకేర్‌ అనాఽథ బాలల  పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం కేర్‌ చిల్డ్రన్స్‌ పథకం కోవిడ్‌ వల్ల తల్లిదండుల్రను కోల్పోయిన చిన్నారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం అన్నారు. చిన్నారులు 18 నుంచి 23 ఏళ్ల వరకు వారికి స్టైఫండ్‌ అందజేస్తారని 23 ఏళ్లు వయస్సు వచ్చాక రూ.పది లక్షలు అందిస్తారన్నారు. జిల్లాలో 28 మందిని కొవిడ్‌ బాధిత అనాఽథలుగా గుర్తించాన్నారు. వారి సంరక్షణ బాధ్యత జిల్లా బాలల సంరక్షణ అధికారి చూడాలన్నారు. ఈ నెల 15 లోగా అనాథ బాలలను గుర్తించి  నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాలోని 140 చైల్డ్‌ కేర్‌ సంస్థలను ఆర్‌డీవోలు తనిఖీలు చేసి  నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీలు హిమాన్షు శుక్లా, బీఆర్‌ అంబేడ్కర్‌, డేవిడ్‌ రాజు, డీఈవో రేణుక, డీ ఎంహెచ్‌వో రవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:24:17+05:30 IST