తప్పులతడకగా ఓటర్ల లిస్టు
ABN , First Publish Date - 2021-10-30T04:50:28+05:30 IST
నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో జరగబోయే 45, 46 డివిజన్ల ఎన్నికల ఓటర్ల లిస్టు తప్పుల తడకగా ఉందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆరోపిం చా రు.
టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి
ఏలూరు ఫైర్‌స్టేషన్, అక్టోబరు 29: నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో జరగబోయే 45, 46 డివిజన్ల ఎన్నికల ఓటర్ల లిస్టు తప్పుల తడకగా ఉందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆరోపిం చా రు. ఇటీవల నగరపాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఉన్న తప్పు లు తడకలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఓటర్ల లిస్టులో తప్పులను సరిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడా ది మార్చి 10వ తేదీన జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచురించిన జాబితాలో 45వ డివిజన్‌లో 3690 ఓట్లు ఉన్నట్టు చూపించారన్నారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఓటర్ల లిస్టులో 4753 ఓట్లు ఉన్నట్టు చూపించార న్నారు. దాదాపు 1100 ఓట్లు పైగా ఎక్కువగా ఓటరు లిస్టులో ఉన్నాయన్నారు. ఈ ఓట్లు అన్ని 44వ డివిజన్‌కు చెందిన ఓట్లు అన్నారు. వీరంతా గత ఎన్ని కల్లో ఓటు వేశారని మళ్లీ 45వ డివిజన్ ఓటరు జాబితాలో పేర్లు చేర్చార న్నారు. వెంటనే ఓటరు లిస్టును సవరించి నిజమైన ఓటరు లిస్టును ప్రచురిం చాలన్నారు.