ఏలూరులో అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్న ఆకతాయిల అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-30T17:31:17+05:30 IST
ఏలూరులో బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తున్నఆకతాయిలు 16 మందిని పోలీసులు...

ప.గో.జిల్లా: ఏలూరులో బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తున్నఆకతాయిలు 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఆకతాయిలు న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులకు పలు పిర్యాదులందాయి. బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అల్లరిమూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు.