జిల్లాకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-02-02T04:55:42+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు సోమవారం జిల్లాకు చేరింది. వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా వర్చువల్‌ విధానం లో ఢిల్లీ నుంచి అందించిన అవార్డు పోస్టు ద్వా రా కలెక్టరేట్‌కు చేరుకోగా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు అందుకున్నారు.

జిల్లాకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు
స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డుతో కలెక్టర్‌

ఏలూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ అవార్డు సోమవారం జిల్లాకు చేరింది. వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా వర్చువల్‌ విధానం లో ఢిల్లీ నుంచి అందించిన అవార్డు పోస్టు ద్వా రా కలెక్టరేట్‌కు చేరుకోగా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు అందుకున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ) కింద ‘ప్రజల భాగస్వామ్యం’ కేటగిరీ లో జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. బహి రంగ మల విసర్జన వల్ల కలిగే నష్టాలపై జిల్లాలో ప్రజలను చైతన్యపరచడం, మరుగుదొడ్ల వినియో గంపై వారికి అవగాహన కల్పించి భాగస్వాముల ను చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయడంతో ఈ అవార్డు జిల్లాను వరించిందని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-02-02T04:55:42+05:30 IST