నా కాపురం నిలబెట్టండి

ABN , First Publish Date - 2021-03-25T05:20:52+05:30 IST

తన కాపురం నిలబెట్టాలంటూ భార్య అలుపెరగని పోరాటం చేస్తోంది.

నా కాపురం నిలబెట్టండి
అత్తమామల ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న మాధవి

మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

నిడమర్రు మార్చి 24 :తన కాపురం నిలబెట్టాలంటూ భార్య అలుపెరగని పోరాటం చేస్తోంది. గత మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన కొత్త మాధవి, శివమణి గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం పెట్టిన మూడు నెలలు అన్యోన్యతగా ఉన్నా తర్వాత నుంచి గొడవలు ఆరంభ మ య్యాయి. ఇదిలా ఉండగా వారం రోజుల కిందట భర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలు అత్తమామల ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తన కాపురం నిలబెట్టాలని డిమాండ్‌ చేస్తోంది. నాపై తపుడు ఆరోపణలు చేస్తున్నారు. నన్ను వదిలించుకుని తన కొడుక్కి గొప్ప డబ్బున్న సంబంధం చేయాలనే ఆశతోనే నా అత్తమామలు ఈ డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి తండ్రి భాస్కర రావు మాట్లాడుతూ వేరే కాపురం పెట్టిన మా పాపను చిత్ర హింస లకు గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు  పోలీ సులు అత్తమామలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated Date - 2021-03-25T05:20:52+05:30 IST