ఉషాబాల సంస్థ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-05T05:55:49+05:30 IST

ఉపాబాల సంస్థ అకౌంటెంట్‌ ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.

ఉషాబాల సంస్థ అకౌంటెంట్‌ ఆత్మహత్య

దెందులూరు, ఫిబ్రవరి 4 : ఉపాబాల సంస్థ అకౌంటెంట్‌ ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. దెందులూరు మం డలం కొవ్వలి గ్రామానికి చెందిన సకినాల హరినాథ్‌బాబు (54) గత 30 ఏళ్లుగా ఉషాబాల సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఏలూరు ప్రధాన కేంద్రంగా కొనసాగిన ఉషాబాల వ్యాపార సంస్థలపై ఇన్‌కంటాక్స్‌ అధికారులు గత నెల 28 నుంచి 1వ తేదీ వరకు దాడులు చేశారు. దీంతో అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు.కొవ్వలి గ్రామంలోని తన నివాసంలో బుధవారం రాత్రి నిద్రపో కుండా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడని.. ఉదయం చూసేసరికి  ఇంటి పెరటి నూతిలో మృతిచెంది ఉన్నాడు. తీవ్ర మనోవేదనతో నూతిలో దూకి ఆత్మ హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.మృతుడికి భార్య కుమారుడు ఉన్నాడు.

Updated Date - 2021-02-05T05:55:49+05:30 IST