చిన వెంకన్న ఆలయంలో సేవల సమయాలు మార్పు

ABN , First Publish Date - 2021-05-06T05:01:47+05:30 IST

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవల సమయాల్లో గురువారం నుంచి మార్పులు చేసినట్టు దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి తెలిపారు.

చిన వెంకన్న ఆలయంలో సేవల సమయాలు మార్పు

ద్వారకా తిరుమల, మే 5: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవల సమయాల్లో గురువారం నుంచి మార్పులు చేసినట్టు దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకే భక్తులకు దర్శనం కల్పించబడుతుందని తెలిపారు. అష్టోత్తర నామార్చన పూజ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు , స్వర్ణతులసీ దలార్చన ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ప్రతీ బుధవారం మాత్రమే నిర్వహిస్తారు. అమ్మవార్లకు కుంకుమర్చన  ఉదయం 8 నుంచి ఉదయం 9 గంటల వరకు, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉదయం 8 నుంచి 8.30 వరకు, స్వామివారి నిత్యార్జిత కల్యాణంఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు , గోపూజ ఉదయం 7.30 నుంచి 11.30 వరకు  నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత జరిగే అన్ని కార్యక్రమాలు అర్చ కుల సమక్షంలో ఏకాంతంగా జరుగుతాయని తెలిపారు. Updated Date - 2021-05-06T05:01:47+05:30 IST