ఎస్ఐ ఆత్మహత్య.. ఏలూరులో విషాదం
ABN , First Publish Date - 2021-01-20T05:51:47+05:30 IST
గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయకుమార్ ఆత్మహత్యతో ఏలూరు లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో విషాదా న్ని నింపింది.

ఏలూరు క్రైం, జనవరి 19 : గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయకుమార్ ఆత్మహత్య ఏలూరు లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో విషాదా న్ని నింపింది. తండ్రి మత్స్యశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయిన తరువాత గుండెపోటుతో మరణించారు. విజయ్‌కుమార్‌కు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 2012లో ఎస్ఐగా ఎంపికయ్యా రు. హనుమాన్ జంక్షన్ ఎస్ఐగా మొదటి పోస్టింగ్. తరువాత ఏలూరు రైల్వే ఎస్ఐగా, ముసునూరు ఎస్ఐగా పనిచేశారు. ప్రస్తుతం గుడివాడ టూ టౌన్ ఎస్ఐగా ఉన్నారు. సోమవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయనకు దూబచర్లకు సమీపంలోని కొత్తగూడానికి చెందిన స్వప్నతో వివాహమైంది. ఆయన మృత దేహం మంగళవారం సాయంత్రం స్వగృహానికి రాగా అక్కడ నుంచి సమాధు లతోటకు తరలించి పోలీసు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం అంత్యక్రియలు జరిగాయి.