నాడు రూ.125.. నేడు రూ.375
ABN , First Publish Date - 2021-01-21T04:20:54+05:30 IST
ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.అమ్మకాలకు ప్రభు త్వం అనుసరిస్తున్న ఆన్‌లైన్ విధానంలో ధరలకు, ఇసుక సరఫరాలో ధర లకు పొంతన లేకుండా పోతోంది.

రీచ్‌ల నుంచే నేరుగా ఇసుక సరఫరా
అయినా తగ్గని ధర
కొనుగోలుదారుల నుంచి దోపిడీ
రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న కీలక నేత
(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.అమ్మకాలకు ప్రభు త్వం అనుసరిస్తున్న ఆన్‌లైన్ విధానంలో ధరలకు, ఇసుక సరఫరాలో ధర లకు పొంతన లేకుండా పోతోంది. లారీ ఇసుకపై రూ. 1500లు చెల్లిస్తే గానీ ఇంటికి చేరుకోవడం లేదు. ఇటీవల ఇటువంటి దోపిడీ అధిక మైంది. గోదావరి రీచ్‌లు, ర్యాంప్‌ల్లో ఇసుక బుక్ చేసు కోవాలంటేనే గగనమైపో తోంది. వెబ్‌సైట్ తెరుచుకున్న కొద్దిసేపట్లోనే ఇసుక బుకింగ్ పూర్తయిపో యినట్టు సమాచారం వస్తోంది. లేదంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. బుకింగ్‌కు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు ప్రక్రియ పూర్తయినా సకాలంలో ఇసుక రావడంలేదు. అయినా ప్రభుత్వం నిర్ణయి ంచిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు.
ఇసుక చేరాలంటే మామూలు ఇవ్వాల్సిందే..
ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయించింది. దూరాన్ని బట్టి రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిర్ధారించిన ధరతో ఇసుక జిల్లాలో ఎక్కడికైనా గరిష్టంగా రూ.15 వేలకు చేరిపోవాలి. తాడేపల్లిగూడెం పట్టణానికి రూ.12,500లకు ఇసుక అందజే యాలి. అయితే తాడేపల్లిగూడెంకు ఇసుక చేరుకోవడానికి రూ.15 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకుంటే రోజుల తర బడి వేచి చూడక తప్పడం లేదు. దానికి తోడు చిలక్కొట్టుడు ప్రధాన సమస్యగా మారిపోయింది. మరో వైపు ఇతర జిల్లాలకు గోదావరి నుంచి ఇసుక తరలిపోతోంది. దీని వల్ల జిల్లాలో ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారికి జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టాక్ పాయింట్ ధర అదనం...
గోదావరి రీచ్‌ల్లో ప్రస్తుతం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో స్టాక్‌పాయింట్లకు ఇసుక తరలించి అక్కడ నుంచి ఆన్‌లైన్ బుకి ంగ్‌దారులకు ఇసుక సరఫరా చేసేవారు.రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు సరఫరా చేసే రవాణా చార్జీలతో పాటు, ఇసుక తవ్వకం ధరను కలిపి ప్రభుత్వం టన్ను రూ.375లుగా తేల్చింది. తాజాగా స్టాక్ పాయింట్ల విధానాన్ని పక్కన పెట్టి రీచ్‌ల నుంచే నేరుగా ఇసుక సరఫరా చేస్తు న్నారు. దీని వల్ల స్టాక్ పాయింట్ల వరకు చెల్లించే రవాణా భారం విని యోగదారులపై పడకూడదు.తెలుగుదేశం ప్రభుత్వంలో రీచ్‌లు, ర్యాంప్‌ల నుంచి ఇసుక సరఫరా చేసినప్పుడు టన్ను కేవలం రూ.125ల ధరగా నిర్ణయించారు. ఇప్పుడు ర్యాంప్‌ల నుంచి సరఫరా అవుతున్నా సరే రూ. 375లకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ పాయింట్ల పేరుతో రవాణా చార్జీలు కాంట్రాక్టర్లకు అప్పనంగా చెల్లించాల్సి వస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతకు చెందిన కీలక అనుచరుడే జిల్లా ర్యాంప్‌లను తన కనుసన్నల్లో నిర్వహిస్తున్నట్టు ప్రచా రం సాగుతోంది. రీచ్‌లతో సంబంధం ఉన్న కొందరి ప్రజాప్రతినిధులకు 25 శాతం భాగస్వామ్యం కూడా కల్పించారు. దాంతో స్టాక్ పాయింట్లతో ప్రమేయం లేకుండా నేరుగా రీచ్‌ల నుంచే ఇసుక తరలిస్తున్నారు. రవాణా ఛార్జీలను మాత్రం కొనుగోలుదారులపై మోపుతున్నారు. మరోవైపు లారీ ఇసుకపై అదనంగా రూ. 1500లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దాంతో వినియోగదారులపై భారం పడుతోంది.