250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-21T04:21:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు అందించే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సమాచారం మేరకు విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకు న్నారు.

250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్న అధికారులు

పెదపాడు, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు అందించే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సమాచారం మేరకు విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకు న్నారు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందిన నల్ల మల్లారెడ్డి లారీలో కాకినాడకు 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులకు అందిన సమాచారం మేరకు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీతో సహా రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.నాలుగు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఎస్‌ డీటీ లక్ష్మి, ఆర్‌.ఐ. నాగమణి, వీఆర్వో బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:21:01+05:30 IST