నాడు నేడు పనులు నాణ్యతగా ఉండాలి
ABN , First Publish Date - 2021-02-07T05:24:30+05:30 IST
నాడు నేడు పనులు నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి అన్నారు.

పంచాయతీ రాజ్ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి
నిడమర్రు, పిబ్రవరి 6 : నాడు నేడు పనులు నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్ ఎస్‌ఈ జీసీ భాస్కరరెడ్డి అన్నారు. నిడమర్రు మండలంలో నాడు – నేడు పనులను శనివారం పరిశీలించి పనుల నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. దేవరగోపవరం ప్రాథమిక పాఠశాలలో పనులు జరిగిన తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ కేఎస్‌ఎస్ శ్రీనివాసరావు, భీమడోలు డీఈ యూ.శ్రీనివాసరావు, మండల ఏఈ జే.అప్పారావు, ఇంజనీరింగ్ సిబ్బంది చక్రపాణి, సతీష్, జైదీప్, హెచ్‌ఎంలు దంగేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.