మేమే.. కాదు మేమే..!

ABN , First Publish Date - 2021-02-05T06:33:33+05:30 IST

ఆకివీడు మండలం అయి భీమవరం సర్పంచ్‌ పదవికి పోటీ చేసేం దుకు అధికార పార్టీ లో ఇద్దరు అభ్యర్థుల మధ్య రసవత్తర పోరు నెలకొంది.

మేమే.. కాదు మేమే..!

ఆకివీడు మండలం   అయి భీమవరం సర్పంచ్‌  పదవికి పోటీ చేసేం దుకు అధికార పార్టీ లో ఇద్దరు అభ్యర్థుల మధ్య రసవత్తర పోరు నెలకొంది. తామే నిజమైన వైసీపీ అభ్యర్థులమని ఇరువురు, వారి మద్దతుదారులు వాదిస్తున్నారు. బొడ్డు దేవిని పార్టీ బలపరుస్తున్నదని మండల కన్వీనర్‌ కేశిరెడ్డి మురళి ప్రకటించారు. మరో వర్గం నుంచి నామినేషన్‌ వేసిన సామ్రాజ్యం ‘మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశాం. మమ్మల్ని కాదని టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిని అభ్యర్థిగా  నిలబెట్టారు. దీనిని వ్యతిరేకిస్తున్నాం. తానే నిజమైన అభ్యర్థిని’ అని స్పష్టం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇది ఎవరికి లాభిస్తుందో చూడాల్సి ఉంది.

 – ఆకివీడు రూరల్‌ :

Updated Date - 2021-02-05T06:33:33+05:30 IST