పశ్చిమ పోలీసులను అభినందించిన గవర్నర్‌

ABN , First Publish Date - 2021-03-25T05:10:44+05:30 IST

జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచం దన్‌ ప్రత్యేకంగా అభినందిం చా రు.

పశ్చిమ పోలీసులను అభినందించిన గవర్నర్‌
గవర్నర్‌ నుంచి ప్రశంసాపత్రం అందుకుంటున్న ఎస్పీ నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, మార్చి 24 : జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచం దన్‌ ప్రత్యేకంగా అభినందిం చా రు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 23 మంది వలస కార్మికులను కాం ట్రాక్టర్‌ పాలకొల్లు మం డలం పూలపల్లిలో ఉన్న సంధ్య మెరైన్‌ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి మోసగించాడు. దీంతో బాధితులు ఈనెల 19వ తేదీన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, పాలకొల్లు టౌన్‌ సీఐ చిన్నం ఆంజనేయులు, ఎస్‌ఐ జేవీఎస్‌ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వెంటనే 23 మంది బాధితులకు న్యాయం చేశారు. కార్మికులు ఒడిశా వెళ్లిపోతామని అనడంతో రవాణా, భోజన వసతులు కల్పించి స్వగ్రామానికి చేర్చారు.ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ బుధవారం జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌కు ప్రశంసాపత్రాన్ని అందించారు. ఎస్పీతో పాటు నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, పాలకొల్లు టౌన్‌ సీఐ చిన్నం ఆంజనేయులు, ఎస్‌ఐ జీవీఎన్‌ ప్రసాద్‌ ఉన్నారు. 

Updated Date - 2021-03-25T05:10:44+05:30 IST