బరి..తెగిస్తున్నారు!

ABN , First Publish Date - 2021-01-13T05:03:45+05:30 IST

పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. బరులు సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ వారికే బరుల అనుమతి లభి స్తోంది.

బరి..తెగిస్తున్నారు!
తలపడుతున్న కోళ్లు

ఈ ఏడాది మోతుబరులు దూరం 

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సిద్ధం

అధికార పార్టీ సానుభూతిపరులకే అనుమతి

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

 పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. బరులు సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ వారికే బరుల  అనుమతి లభి స్తోంది. ప్రతిపక్షపార్టీల్లో ఉన్న నాయకులకు బరులు వేసుకోవద్దంటూ ఆదేశాలు వెళుతున్నాయి. దాంతో ఈ ఏడాది తాడేపల్లిగూడెం నియో జకవర్గంలో పెద్ద బరులు లేకుండా పోతున్నాయి. లేదంటే హైద రాబాద్‌, బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తాడేపల్లిగూడెం కోడి పందేలకు విచ్చేసేవారు. పట్టణ సమీపంలోని తోటలో వేసిన బరికి వేల సంఖ్యలో  పందెం రాయుళ్లు హాజరయ్యే వారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలకు మూడు రోజుల పాటు అక్కడ సందడే సందడి. గతేడాది నుంచి ఆ బరి లేకుండా పోయింది. బరి నిర్వాహకులు ఇతర పార్టీలకు చెందిన వారు కావ డంతో అధికార పార్టీ ముఖ్య నేత అనుమతి ఇవ్వలేదు. దాంతో ఉంగు టూరు నియోజకవర్గంలో గతేడాది బరి వేశారు. ఈ ఏడాదైనా అనుమతి లభిస్తుందని ఆశించారు. కానీ వైసీపీ సానుభూతి పరులు, నాయకులకే అవకాశం ఇచ్చారు. గతంలో పట్టణంలో లాడ్జిలన్నీ ముందుగానే బుక్‌ చేసుకునేవారు. రెండు నెలల ముందు నుంచే అడ్వాన్స్‌ బుకింగ్‌లు జరిగేవి. ఈ సారి వారం రోజుల ముందు కూడా లాడ్జిలు బుక్‌ కాలేదు.  ఒక్కరోజు ముందు మాత్రమే ఇతర ప్రాం తాల నుంచి పట్టణానికి పందెం రాయుళ్లు చేరుకున్నారు. దాంతో కోడి పందేలు కళ వచ్చినట్టయింది. నియోజకవర్గంలో పెద్దబరి అంటూ లేకపోవడంతో పందెం రాయుళ్లలో కాస్త ఉత్సాహం సన్నగిల్లింది. 


Updated Date - 2021-01-13T05:03:45+05:30 IST