ఏకగ్రీవాలు స్వల్పమే

ABN , First Publish Date - 2021-02-05T06:37:31+05:30 IST

పంచాయతీ తొలి పోరు నామినేషన్ల ఘట్టంలో అధికార పార్టీ పట్టు నిలుపుకునేందుకు విఫల యత్నాలు చేసింది. ఏకగ్రీవాల ముసుగులో వైసీపీ చేసిన ప్రయత్నాలకు ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేయగలిగింది.

ఏకగ్రీవాలు స్వల్పమే

 తొలి దఫాలో 41 పంచాయతీలే

అధికార పార్టీదే పైచేయి.. 

 చివరి క్షణాల్లో బేరసారాలు

 తమ వారు కాకున్నా కండువా కప్పేశారు

 వైసీపీ వింత పోకడ.. పట్టు బిగించిన టీడీపీ

 అనేకచోట్ల జనసేనతో కలిసి ఎదురొడ్డారు

 198 గ్రామాలు.. 1482 వార్డుల్లో ఎన్నికలు

 నేటి నుంచి ప్రచారం ఉధృతం.. 9న పోలింగ్‌


(ఏలూరు– ఆంధ్రజ్యోతి):

పంచాయతీ తొలి పోరు నామినేషన్ల ఘట్టంలో అధికార పార్టీ పట్టు నిలుపుకునేందుకు విఫల యత్నాలు చేసింది. ఏకగ్రీవాల ముసుగులో వైసీపీ చేసిన ప్రయత్నాలకు ప్రతిపక్ష తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేయగలిగింది. నామి నేషన్ల ఉపసంహరణ రోజున అన్ని మండలా ల్లోనూ విచిత్ర పోకడలు నెలకొన్నాయి. ప్రజలు పార్టీల వారీగా విడిపోయి ఎన్నికలకు సన్నద్ధ మవుతుంటే రాజకీయ పక్షాలు అలవోకగా పొత్తుకు దిగాయి. గెలుపే ధ్యేయంగా మీకిది.. మాకిది అంటూ పంచుకున్నాయి. కొన్నిచోట్ల దేవాలయాలు, కల్యాణ మండపాలు నిర్మిస్తామంటూ అభ్యర్థులు బేరసారాలకు దిగారు. ఎన్నికల కమిషన్‌ నిక్కర్చిగా వ్యవహరించడంతో బెదిరింపులకు పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. నామినేషన్లు ఉపసంహరణ ఘట్టం ముగిసే నాటికి మొత్తం 41 సర్పంచ్‌ పదవులు, 1,070 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. 198 సర్పంచ్‌ పదవులకు, 1482 వార్డు మెంబర్ల పదవులకు ఈ నెల 9న పోలింగ్‌ జరగనుంది. 


చిత్ర విచిత్రాలెన్నో

తొలివిడత నామినేషన్ల ఘట్టం ఉపసంహరణకు చేరుకునే సమయం నాటికి జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏకగ్రీవమైన స్థానాలు అతి తక్కువగానే ఉన్నప్పటికీ జరిగినచోట్ల చాలా గ్రామా ల్లో టీడీపీ ముందుగా అభ్యర్థులను పోటీలోకి దింపలేక పోయింది. యలమంచిలి మండలంలో అత్యధికంగా తొమ్మిది మంది సర్పంచ్‌ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది వైసీపీ అనుకూలురే. బూరుగుపల్లిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి పైచేయి సాధించారు. ఈ మండలంలో వైసీపీ దూకు డు కట్టడికి టీడీపీ ప్రయత్నించినప్పటికీ కొన్నిచోట్ల ఊరు అభి వృద్ధి ప్రస్తావన చేసి ఏకగ్రీవం అయ్యేలా చేశారు. వీరవాసరం మండలం మూడు గ్రామాల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం కాగా, ఇక్కడ సైలెంట్‌గా పని పూర్తిచేశారు. చింతలకోటిగరువు లో టీడీపీ, వైసీపీ అనుకూలురు బరిలోకి దిగగా ఈ గ్రామం లో ఎవరైతే ఎక్కువగా దేవాలయాల నిర్మాణానికి వెచ్చిస్తారో వారిదే సర్పంచ్‌ పదవంటూ బేరం పెట్టారు. దీంతో గ్రామంలో దేవాలయాలు నిర్మించడానికి రూ.20 లక్షలు ఇవ్వడానికి ముం దుకు వచ్చిన వ్యక్తే ఏకగ్రీవమయ్యారు. భీమవరం మండలం లో 21 పంచాయతీలు ఉండగా, అన్నిచోట్ల తెలుగుదేశం, జన సేన ఉమ్మడి అనుకూల అభ్యర్థులను బరిలోకి దించింది. కొమ రాడలో మండలస్థాయి బీజేపీ నేతలు ఉన్నారు. ఈ తరు ణంలో పార్టీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని తమకు ఆ గ్రామాన్ని వదిలేయాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. ఇక్కడ బీజేపీ, వైసీపీ అనుకూల అభ్యర్థుల ప్రధాన పోటీ జరుగుతుందను కుంటే చివరకు ఊరు వారి జోక్యం తో ఏకగ్రీవమైంది. ఉండి నియోజ కవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఎక్కడికక్కడ నామినేష న్లు ఉపసంహరణకు ఎత్తులు పైఎత్తులు నడిచాయి. పాలకో డేరు మండలంలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క మోగల్లులో టీడీపీ సానుభూతి పరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో మొదటి నుంచి పేరొందిన కోరుకొల్లు నేత గ్రామంలో పట్టును ప్రదర్శించి మిగతా వారిని రంగంలో లేకుండా చేసి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా చేశారు. శృంగవృక్షం లోనూ ఏకగ్రీవం జరిగేలా వైసీపీ నేతలు చివరి క్షణం వరకూ ప్రయత్నించారు. బరి నుంచి తప్పుకోవడానికి మిగతా పార్టీ అనుకూలురు సిద్ధంగా లేకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాళ్ళ మండలం బొండాడలోనూ వైసీపీ, టీడీపీలు చెరో రెండు న్నర ఏళ్లు మనమే పాలిద్దామంటూ ఫిప్టీ ఫిప్టీ పేరిట ఏకగ్రీ వానికి పావులు కదిపాయి. వేంపాడులోనూ వైసీపీ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండగా ఇక్కడ చివరి క్షణంలో సర్ధుబా టు చేశారు. ఏలూరుపాడులో సర్పంచ్‌గా వైసీపీ సానుకూ లుడు, ఉప సర్పంచ్‌గా టీడీపీ అనుకూలుడు ఉండేలా ఒప్పం దం చేసుకుని ఏకగ్రీవం జరిపించారు. నర్సాపురం మండలం రాజులంకలో సర్పంచ్‌ పదవికి హోరాహోరీ నెలకొంది. ఊరు పెద్దలు జోక్యంతో బరి నుంచి టీడీపీ సానుభూతిపరుడు పక్క కు వైదొలగగా వైసీపీ విజయపతాకం ఎగురవేసింది. బియ్యపు తిప్పలోనూ, చామకూరపాలెంలోనూ తెలుగుదేశం సానుభూ తిపరులు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో వైసీపీ ఈ రెండు గ్రామాలను చేజిక్కించుకుంది. మర్రితిప్పలో టీడీపీ అనుకూలుడు వైదొలగడంతో వైసీపీ ఖాతాలోకి ఈ గ్రామం చేరింది. మంత్రి రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచం ట నియోజకవర్గం పెదమల్లంలో వైసీపీ నిలుపుకుంది. 


వీడిన ఉత్కంఠ 

ఒకరిద్దరు ఇండిపెండెంట్లుగా ప్రజాభిమానం పొంది ముం దు వరుసలో ఉండడంతో ఇక్కడ ఎన్నికలు ఏకగ్రీవం చేసి గెలిచిన వ్యక్తికి ఆ క్షణంలోనే వైసీపీ కండువా కప్పి గెలిచిన వాడు మావాడే అంటూ వైసీపీ సంబరాలు చేసుకుంది. దీనిని మిగతా వాళ్ళు వ్యతిరేకించకపోయినా ఊళ్లో గొడవలు ఎందు కంటూ మౌనం దాల్చారు. సర్పంచ్‌ పదవులకు అత్యధికంగా ఏకగ్రీవాలు జరగాలని ఇవన్నీ తమ పార్టీ వారే గెలవాలని వైసీపీ ఎత్తుగడలు వేసినా చివరి నిమిషంలో ఇవన్నీ చిత్త య్యాయి. తెలుగుదేశం, జనసేన ఎక్కడికక్కడ అభ్యర్థులను నిలిపి అధికార పార్టీ దూకుడును కొంత నిరోధించగలిగారు. తొలిపోరులో ఈ పార్టీలది ఇదో నైతిక విజయంగా భావిస్తు న్నారు. కేవలం మోగల్లులోనే టీడీపీ అనుకూలురు ఏకగ్రీవమ య్యారు. 


ఏకగ్రీవ గ్రామాలు : 41

  ఆచంట పెదమల్లం

  ఆకివీడు తరటావ, రాజులపేట

  భీమవరం శ్రీరాంపురం, జొన్నలగరువు, కొమరాడ, లోసరి, 

  యలమంచిలి శిరగాలపల్లి, చింతదిబ్బ, లక్ష్మీపాలెం, నేరేడుమిల్లి, గుంపర్రు, మేడపాడు, నారినమెరక, బూరుగుపల్లి, కంచుస్థంభంపాలెం 

  కాళ్ల ఏలూరుపాడు, బొండాడపేట, మాలవానితిప్ప,  వేంపాడు, బొండాడ

  నరసాపురం గొంది, చామకూరిపాలెం,  బియ్యపుతిప్ప, మర్రితిప్ప, రాజుల్లంక

  పాలకోడేరు కోరుకొల్లు, మైప, గొరగనమూడి, మోగల్లు 

  పాలకొల్లు       సగం చెరువు, వడ్లవానిపాలెం, వెలివెల, బల్లిపాడు,  వెంకటాపురం

  ఉండి       కలిగొట్ల, చెరకువాడ, ఆరేడు

  వీరవాసరం     నేలపోగుల, చింతలకోటిగరువు, పంజావేమవరం రెండో విడత నామినేషన్లు 8849 

ఏలూరుసిటీ, ఫిబ్రవరి 4: రెండో విడత పంచాయతీ పోరుకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది.   కొవ్వూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోని 13 మండలాలలో  మొత్తం 210 గ్రామ పంచాయతీలకు, 2404 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవ విడతకు సంబంధించి  గత మూడు రోజుల్లో మొత్తం 8849   నామినేషన్లు దాఖాలు ఆయ్యాయి. ఇందులో సర్పంచ్‌ పదవులకు  1253, వార్డు మెంబర్ల పదవులకు 7596  నామినేషన్లు దాఖలయినాయి. చివరి రోజైన గురువారం నామినేషన్లు వేయటానికి అభ్యర్థులు పోటెత్తారు. దీంతో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.  

రెండో విడత.. మొత్తం నామినేషన్లు

మండలం  గ్రామాలు సర్పంచ్‌లకు వార్డులకు   మొత్తం

అత్తిలి         18             94 628         722

చాగల్లు         13             58 499         557

దేవరపల్లి 15             108 656         764

గోపాలపురం        18         123 603         726

ఇరగవరం     21     105 616         721

కొవ్వూరు     16         117 732     849

నిడదవోలు         23         137 678     815

పెనుగొండ        15     93     476     569

పెనుమంట్ర        18         120     530     650

పెరవలి             18 91     595     686

తణుకు     9             50 469     519

తాళ్లపూడి     11     70 439     509

ఉండ్రాజవరం        15     87         675     762

మొత్తం             210     1253         7596             8849


గుర్తు కేటాయిస్తానని చెప్పి మోసం చేశారు

సర్పంచ్‌ అభ్యర్థి ఆందోళన

యలమంచిలి, ఫిబ్రవరి 4 : గుర్తు కేటాయిస్తానని చెప్పి స్టేజ్‌ వన్‌ ఎన్నికల అధికారి ఎన్‌.విజయానంద్‌ ఉపసంహరణ పత్రంపై సంతకం తీసుకుని మోసం చేశారని కాజ పడమర గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి కడలి భాస్కరరావు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. పత్రం తీసుకున్న తర్వాత ఉపసంహరణ రశీదు ఇవ్వడంతో ఆశ్చర్యపోయానని వాపోయారు. తనను ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థిగా పరిగణించి న్యాయం చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) చాహత్‌ బాజ్‌పేయ్‌కు విజ్ఞప్తి చేయడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

Updated Date - 2021-02-05T06:37:31+05:30 IST