74 నామినేషన్లు ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-02-07T05:18:10+05:30 IST

ఎన్నికల ప్రక్రియలో మరో అంకం ప్రారం భమైంది. నిన్నటి వరకూ నామినేషన్ల హడావుడిలో మునిగితేలిన నాయకులు శనివారం నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి పెట్టారు.

74 నామినేషన్లు ఉపసంహరణ

తణుకు/ఇరగవరం, ఫిబ్రవరి 6 : ఎన్నికల ప్రక్రియలో మరో అంకం ప్రారం భమైంది. నిన్నటి వరకూ నామినేషన్ల హడావుడిలో మునిగితేలిన నాయకులు శనివారం నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి పెట్టారు. తణుకు మండలంలో రెండు సర్పంచ్‌లు, 18 వార్డు సభ్యుల అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు ఎంపీడీవో టిఎస్‌ఎన్‌ మూర్తి చెప్పారు.  వార్డు సభ్యులకు సంబంధించి వేల్పూరు 12, మండపాక 6 ఉపసంహరించుకున్నారన్నారు. సర్పంచ్‌ల నామినేషన్లు 46, వార్డు సభ్యుల నామినేషన్లు 451 మిగిలాయి. ఇరగవరం మండలంలో 4  సర్పంచ్‌ నామినేషన్లు, 35 వార్డు సభ్యుల నామి నేషన్లను ఉపసంహరించుకున్నారు. గోటేరు, అయినపర్రు, రేలంగి గ్రామాల్లో సర్పంచ్‌ల నామినేషన్లు, 21 గ్రామ పంచాయతీల్లో  35 వార్డు సభ్యుల నామి నేషన్లు ఉపసంహరించుకున్నారు. మండలంలో మొత్తం సర్పంచ్‌లకు 105 నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ అనంతరం 101 ఉన్నాయి.వార్డు సభ్యుల 605 నామినేషన్లలో 35 ఉపసంహరించగా 568 నామినేషన్లు మిగి లాయి.అత్తిలి మండలంలో సర్పంచ్‌ల నామినేషన్లు 2, వార్డు సభ్యుల నామినే షన్లు 13 ఉపసంహరించుకున్నారు. సర్పంచ్‌ల నామినేషన్లు 81, వార్డు సభ్యుల నామినేషన్లు 612 మిగిలాయి.8వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఉంది. 

Updated Date - 2021-02-07T05:18:10+05:30 IST