మంత్రులకు అగ్నిపరీక్ష

ABN , First Publish Date - 2021-02-06T06:01:53+05:30 IST

‘ఇప్పటికే సంక్షేమంలో దూసుకుపోయాం. ఎన్నికల్లోనూ ప్రజాసానుకూలత మన వైపే ఉంది. ఏకగ్రీవాలన్నీ తిరుగులేని ఆధిపత్యం చూపాలి’ వైసీపీ అధిష్ఠానం మంత్రులకు పదే పదే చెబుతోంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

మంత్రులకు అగ్నిపరీక్ష

ఏకగ్రీవాలకు అడ్డంకులు..

పట్టు బిగిస్తున్న ప్రతిపక్షాలు 

ఆచంట, కొవ్వూరు, ఏలూరుల్లో వ్యూహ ప్రతివ్యూహాలు

సంక్షేమం.. ఓట్లు కురిపించేనా ? సీను మారుతున్న పల్లె పోరు 

తొలివిడత 41 సర్పంచ్‌లు, 1070 వార్డులే ఏకగ్రీవం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

‘ఇప్పటికే సంక్షేమంలో దూసుకుపోయాం. ఎన్నికల్లోనూ ప్రజాసానుకూలత మన వైపే ఉంది. ఏకగ్రీవాలన్నీ తిరుగులేని ఆధిపత్యం చూపాలి’ వైసీపీ అధిష్ఠానం మంత్రులకు పదే పదే చెబుతోంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ స్వతంత్రులు ఎక్కడికక్కడ బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానికులు ఏకగ్రీవానికి రాజీ ప్రయత్నిస్తున్నా వీలు లేదంటూ వీరంతా పట్టు బిగిస్తున్నారు. 


సంక్షేమంలో కోట్లు వెదజల్లినా.. పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పట్టు తప్పింది. ఏకగ్రీవాల్లో అనుకున్న మేర ఎందుకు రాణించలేకపోయారు. రాబోయే సీజన్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లో పంచాయతీ ఏం కాబోతోంది. తొలి, రెండో విడతల్లో మంత్రి రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలోను, మలి విడత మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులోని మూడు మండలాలకు, చివరి విడతలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఏలూరులోని రూరల్‌ మండలానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు పట్టు బిగించడంతో తొలి విడత కేవలం 41 సర్పంచ్‌ పదవులు, మరో 1070 వార్డు పదవులు మాత్రమే ఏకగ్రీవమై వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. 


చెరుకువాడ ఏం చేస్తారో ?

జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ముగ్గురు సర్పంచ్‌ ఎన్నికల్లోనే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. తొలి పోరులో ఆచంట నియోజకవర్గంలో ని పోడూరు, ఆచంట, మలి విడత పెనుగొండ, పెనుమంట్ర మండలా లు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాఽథరాజు ప్రాతినిధ్యం వహి స్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు నల్లేరు మీద నడకగా ఉంటుందని అధికార పక్షం లెక్క గట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి లభించిన ఓట్ల లెక్కలు తీసి కూడికలు, తీసివేతలు కట్టా రు. మొత్తం 53 సర్పంచ్‌ పదవుల కు తమదేపై చేయిగా తెలుగు దేశం, జనసేన, బీజేపీ సోదిలో ఉండదని కాస్త గర్వం వలక బోశారు. కానీ తొలి విడతలో కేవలం పెదమల్లంలో మాత్రమే ఏకగ్రీవం కాగా పోడూరులో ఆ పరిస్థితి కూడా కనిపించలేదు. దీంతో మంత్రి అనుచరవర్గం కాస్త తికమకపడింది. ఇక్కడ మాజీ మంత్రి పితాని సత్యనా రాయణ తన పాత క్యాడర్‌ను ఒక దగ్గరకు చేర్చి ఎన్నికల రణం నడుపుతున్నారు. కొన్నింట జనసేనతో జతకట్టారు. ఈ పరిణామాలన్నీ అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాయి. అధికార పక్షానికి పంచాయతీలన్నీ ఏకగ్రీవం కానీయకుండా చేయడంలో టీడీపీ, జనసేనతోపాటు కొన్నింట బీజేపీ కూడా కలిసి వచ్చింది. అందరి దృష్టి ఆచంటపై పడింది. తొలి, మలి విడత ఎన్నికలు జరగనున్న తన నియోజకవర్గంలో మంత్రి రంగనాథరాజు ఏం చేయబోతున్నారా అని సందిగ్దత నెలకొంది. 


కొవ్వూరుపైనే అందరి కన్ను

మరో మంత్రి తానేటి వనిత కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో 40 గ్రామ పంచాయతీలు. అన్నింటికంటే మించి ఒకప్పుడు టీడీపీకి ఈ ప్రాంతం కంచుకోట. రాజకీయ పరిణా మాలు, మారుతున్న సమీకరణాల నేపథ్యం లో ఇక్కడ వనిత గెలుపొంది ఇప్పుడు పార్టీ కి పట్టు బిగించే పనిలో పడ్డారు. కానీ చాగ ల్లు, తాళ్ళపూడి, కొవ్వూరు రూరల్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వైసీపీ వర్గ పోరును ఎదు ర్కొంటుంది. కొవ్వూరు  మండల పరిధిలో ఈ పరిస్థితి కొంత ఎక్కువగానే ఉంది. నామి నేషన్ల సమయంలో వైసీపీ అనుకూలురు రెండుగా చీలిపోయి ఎవరంతటికి వారుగా వ్యవహరించారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వీరందరినీ ఒక దారికి తెచ్చి వివాదం సర్ధుమణిగేలా చేస్తారా. మరేదైనా ఎత్తుగడ లకు దిగుతారా? అని మంత్రి చర్యల పై అందరూ ఒక కన్నేశా రు. మూడు మండలాల పరిధిలో పో టీ జరిగినా సరే లేదా ఏకగ్రీవ మైనాసరే తమదే పైచేయి కావాలని వై సీపీ పట్టుద లతో ఉండగా దీనికి సమాం తరంగా టీడీపీ తన వ్యూహాన్ని అమ లు చేస్తోంది. మంత్రి ఆశిం చినట్లుగా, వైసీపీ అధిష్టానం కోరు కుంటున్నట్లుగా ఈ నియోజకవర్గంలో పంచాయతీలకు ఏకగ్రీవాలు పెరుగుతాయా అనేది అనుమానంగానే ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. 


 ఏలూరులో ఏంజరగబోతోంది

ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని  ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు నియోజకవర్గ పరిధిలో ఒకింత టెన్షన్‌ నెలకొంది. కేవలం ఏలూరు కార్పొరేషన్‌ నియోజకవర్గంలో మూడొంతులు ఉండగా కేవలం 15 గ్రామాలకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరగబోతాయి. వీటిలో అనేక గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. నాని ఇప్పటికే ఈ 15 గ్రామాలు ఎన్నింటిలో ఏకగ్రీవం అయ్యేలా జాగ్రత్త పడతారో చూడాలి. తెలుగుదేశం మాత్రం పట్టు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంతకు ముందు సాధారణ ఎన్నికల్లో సైతం వైసీపీకి స్వల్ప మెజార్టీ రావడం ఆయా గ్రామాల్లో  ఢీ అంటే  ఢీ అనే విధంగా తెలుగుదేశం బలంగా ఉన్న పరిస్థితులను ఇప్పుడు ప్రస్తావి స్తారా. అయితే ఎట్టి పరిస్థితిలోనూ భారీగా ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున తమవైపే సానుకూలత ఉందని వైసీపీ చెప్తున్నా లోలోన గుబులు మాత్రం తీరలేదు. చివరి విడతలో పంచాయతీ ఎన్నిలు ఇక్కడ జరగబోతున్నాయి. ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 


3కు.. రెడీ

జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, ఏలూరు డివిజన్లలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మొత్తం 178 పంచాయతీలు.. 1904 వార్డులు 

మొదటి విడత డివిజన్‌లో ప్రచార హోరు 

198 సర్పంచ్‌లకు 530 మంది, 1479 వార్డులకు 3,188 మంది పోటీ

ఏలూరు సిటీ, ఫిబ్రవరి 5: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామి నేషన్లు స్వీకరిస్తారు. జంగారెడ్డి గూడెం, ఏలూరు, కుక్కునూరు డివిజన్లలోని 11 మండలాల్లోని 178 గ్రామసర్పంచ్‌ పదవులకు, 1904 వార్డులకు ఈ నెల 17న పోలింగ్‌ జరగనుంది. ఈ నేప థ్యంలో శనివారం, ఆది, సోమ వారాల్లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంట ల వరకు నామినేషన్లు స్వీకరి స్తారు. 9న వీటిని పరిశీలించి, 10న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 11న వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. 17వ తేదీ ఉదయం ఆరున్నర నుంచి మధ్యా హ్నం మూడున్నర వరకు పోలింగ్‌ నిర్వహించి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే ఏ ర్పాట్లు పూర్తిచేశారు. ఆయా గ్రామాల్లో సమస్మాత్మక గ్రామా లు, పోలింగ్‌ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే నరసాపురం డివి జన్‌లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో 198 గ్రామాల్లో సర్పంచ్‌ పదవులకు 530 మంది, 1479 వార్డు ల్లో 3188 మంది పోటీ పడుతున్నారు. వీరందరికీ గుర్తు లు కేటాయించారు. రెండో విడత నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో శుక్రవారం అధికారులు వీటిని పరిశీలించారు.


మూడో విడత గ్రామాలు

మండలాలు      గ్రామాలు     వార్డులు

బుట్టాయిగూడెం 21 210

జీలుగుమిల్లి         12 122

జంగారెడ్డిగూడెం 20 216

కొయ్యలగూడెం 16 188

పోలవరం         14 148

చింతలపూడి         19 210

కామవరపుకోట 15 170

లింగపాలెం         22 226

టి.నరసాపురం 15 174

కుక్కునూరు         15 148

వేలేరుపాడు           9   92

మొత్తం 178  1904



పోలింగ్‌ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ అసహనం

ఏలూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి):ఓటర్లకు వారి పోలింగ్‌ బూత్‌ వివరాలు తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. 3వ దశ గ్రామ పం చాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష జరిపారు.  పోలిం గ్‌ స్టేషన్ల జాబితా, వాటి వివరాలు ప్రతి నామినేటెడ్‌ అభ్యర్థికీ అందజేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సం బంధిత అధికారులకు సకాలంలో రిపోర్టు చేయాలని ఆయన చెప్పారు. పోలింగ్‌ స్టేషన్లు ఎక్కడైనా మార్పు చేయాల్సి ఉంటే వెంటనే సంబంఽధిత కారణాలు, వివరాలతో ప్రతిపాదనలు పం పాలని సూచించారు. పోలింగ్‌ సిబ్బంది పనితీరుకు సంబంధిం చి ఆయన అసహనం వ్యక్తంచేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ సెంటర్‌ బందోబస్తు ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలన్నారు. ఈ కేంద్రం ఒకటో అంతస్తులో ఉండేలా చూడడం మంచిదన్నారు. జడ్పీ సీఈవో శ్రీనివాసులు, డీపీవో కె. సురేశ్‌బాబు పాల్గొన్నారు.  


ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా సెల్వం

జిల్లాలో తొలి దశ గ్రామ పంచా యతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు పరిశీలన నిమిత్తం ఐఎఫ్‌ఎస్‌ అధికారి సి.సెల్వంను ఎస్‌ ఈసీ నియమించినట్లు కలెక్టర్‌ ముత్యా లరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 89193 41918 నెంబరు ద్వారా ఎన్నికల వ్యయ పరిశీలనాఽధికారికి ఫిర్యాదులు, సమస్యలు, సూచనలు తెలియజేయ వచ్చునని తెలిపారు. అంతకు ముందు సెల్వంను కలెక్టర్‌ సాదరంగా ఆహ్వానించారు. 




Updated Date - 2021-02-06T06:01:53+05:30 IST