AP: జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న బంద్
ABN , First Publish Date - 2021-10-20T13:38:28+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్‌లో పాల్గొంటున్న 15 మంది టీడీపీ కార్యకర్తలను ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌లపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.