ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షకు 533 మంది గైర్హాజరు
ABN , First Publish Date - 2021-03-25T05:11:39+05:30 IST
ఇంటర్మీడి యట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం నైతికత – మానవ విలువలు(ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్) పరీక్ష జరిగింది.

ఏలూరుఎడ్యుకేషన్, మార్చి 24 : ఇంటర్మీడి యట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం నైతికత – మానవ విలువలు(ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్) పరీక్ష జరిగింది. జనరల్ కేటగిరీలో మొత్తం 34 వేల 133 మంది విద్యార్థులకు 33 వేల 693 మంది హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 4 వేల 823 మంది విద్యార్థులకు 4 వేల 730 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి డి.ప్రభాకరరావు తెలిపారు. మొత్తం 533 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ పరీక్షలు బుధవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశా యని, ఎక్కడా అవాంఛ నీయ సంఘటనలు నమోదుకాలేదని తెలిపారు.