మేలైన పరిశ్రమను ఎంచుకోవాలి : ఏసుదాసు
ABN , First Publish Date - 2021-03-25T05:14:19+05:30 IST
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మేలైన పరిశ్రమ ఎంపిక చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి.ఏసుదాసు సూచించారు.

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 24 : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మేలైన పరిశ్రమ ఎంపిక చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి.ఏసుదాసు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిడమర్రు, పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో మల్లికార్జునరావు మాట్లాడుతూ పరిశ్రమ ఎంపిక విషయంలో మనకు తక్కువ ధరకు దొరికే ముడి సరుకు, ఆ ప్రొడక్టు మార్కెట్ విలువను చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ అధికారి కె.యువరామకిశోర్, ఈవోపీఆర్డీ కొయ్యే వెంకట్రావు, ఏఎస్‌వో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.