ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి : బాలాజీరావు
ABN , First Publish Date - 2021-02-07T05:23:05+05:30 IST
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు అన్నారు.

నిడదవోలు, ఫిబ్రవరి 6 : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు అన్నారు. నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. బ్యాలెట్ పేపర్, పోలింగ్‌కు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు జర గాల న్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.గంగరాజు, ఎంపీడీవో ఎ.రాము, సీఐ కేఏ స్వామి ఉన్నారు.