నాడు నేడు పనులు వేగవంతం చేయండి : డీఈవో
ABN , First Publish Date - 2021-01-21T04:09:16+05:30 IST
నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డీఈవో సీవీ రేణుక సూచించారు.

తణుకు, జనవరి 20 : నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డీఈవో సీవీ రేణుక సూచించారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను బుధవారం పర్యవేక్షించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిజె ప్రభు వరం పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. నాడు నేడు పనుల ద్వారా విద్యారంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తణుకు మండల ప్రధాన కార్యదర్శి పి.సంజయ్‌గాంధీ, పి.వీరబాబు, ఆనంద ప్రసాద్, వీరభద్రరావు పాల్గొన్నారు.