దీక్ష యాప్ ద్వారా మెరుగైన విద్యా బోధన
ABN , First Publish Date - 2021-01-21T04:10:01+05:30 IST
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా తక్కువ సమయంలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేయడం ఎలా అనే అంశంపై దీక్ష యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నా మని డీఈవో రేణుక అన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 20: ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా తక్కువ సమయంలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేయడం ఎలా అనే అంశంపై దీక్ష యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నా మని డీఈవో రేణుక అన్నారు. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మూడు రోజులు నిర్వహించే జిల్లా శిక్షణ కార్యక్ర మాన్ని బుధవారం ప్రారంభించారు.శిక్షకులు పలు అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో జాన్ ప్రభాకర్, ఎంఈవో వి.హనుమ, ఎస్ఆర్పీలు బలరాం, శ్రీహరి, కార్తీక్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.